Tuesday, May 14, 2024

ఏపి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ?

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సమీర్ శర్మ ఎంపిక అయినట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారని సమాచారం. సమీర్ శర్మను కేంద్ర సర్వీసుల నుంచి ఏపికి రీపాట్రియేట్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకే సమీర్‌ శర్మను రాష్ట్రానికి పంపుతున్నట్లు కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

కొనేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న సమీర్ శర్మ ప్రస్తుతం కేంద్రంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర సర్వీసుల్లో అంత పెద్ద పోస్టులో ఉన్న సమీర్ శర్మ సడెన్‌గా రాష్ట్ర కేడర్‌కు రావడం హాట్‌టాపిక్‌గా మారింది. 1985 బ్యాచ్‌కు చెందిన సమీర్‌ శర్మను తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)ని చేస్తారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌(1987 బ్యాచ్‌) సమీర్‌ శర్మ కంటే రెండేళ్లు జూనియర్‌. ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ నెల 30న రిటైర్ అవుతున్నారు. ఆయన సర్వీసును మరో మూడు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి లేఖ రాసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement