Friday, April 26, 2024

సికింద్రాబాద్ విధ్వంసం సూత్రదారి సుబ్బారావే.. 14 రోజుల రిమాండ్‌..

సికింద్రాబాద్‌ అల్లర్లను సూత్రదారి సుబ్బారావు అని, పక్కా ప్లాన్‌ ప్రకారమే రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడ్డారని రైల్వే ఎస్పీ అనురాధ స్పష్టం చేశారు. విధ్వంసానికి కారకులైన మల్లారెడ్డి,శివ, బెస్సిరెడ్డిని అరెస్ట్‌ చేయడం జరిగిందన్నారు. బోడుప్పల్‌లో ఉన్న ఓ హోటల్‌లో కుట్రకు ప్లాన్‌ చేశారని, సుబ్బారావు శివతో కలిసి విద్యార్థులను రెచ్చిగొట్టాడన్నారు. ఈ అల్లర్ల కోసం సుబ్బారావు రూ.35 వేలు ఖర్చు చేశాడని రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు.

ఆవుల సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్‌
సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో ఆవుల సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. సుబ్బారావుతోపాటు మరో ముగ్గురికి రిమాండ్‌కు విధిస్తూ మెజిస్ట్రేట్‌ కీలక నిర్ణయం ప్రకటించింది. నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఆవుల సుబ్బారావుకు ఆర్మీలో అనుభవం..
2011లో ఆర్మీలో ఆవుల సుబ్బారావు పనిచేశారు. దీంతో ఆయన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ మొత్తం తెలుసుకున్నాడు. 2014లో సాయి డిఫెన్స్‌ అకాడమీ ప్రారంభించారు. ఆర్మీలో సెలెక్ట్‌ అయిన తర్వాత అభ్యర్థుల దగ్గర రూ.3 లక్షలు వసూలు చేసేవాడు. అభ్యర్థుల టెన్త్‌ సర్టిఫికెట్లు పెట్టుకుని డబ్బులు తీసుకున్న తరువాత సర్టిఫికెట్లు తిరిగి ఇస్తాడు. 2019 ఆర్మీ అభ్యర్థులను రెచ్చిగొట్టిన సుబ్బారావు ఏఆర్‌వో ఆఫీస్‌ దగ్గర ధర్నాకు ప్లాన్‌ చేశారు. బీహార్‌ మాదిరిగా రైళ్లను తగలబెట్టాలని అభ్యర్థులకు సూచించాడు. సుబ్బారావుకు నిత్యం టచ్‌లో ఉన్న అనుచరుడు శివ ఆదేశాలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అభ్యర్థులు విధ్వంసం సృష్టించారు. పలు ఆర్మీ గ్రూపులతోపాటు సుబ్బారావు ప్రత్యేకంగా కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి అందులో రెచ్చగొట్టే మెసేజులు చేసి అభ్యర్థులను దాడులకు పాల్పడేలా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement