Friday, April 26, 2024

Big Breaking | తెలంగాణ నుంచి ప్రొఫెసర్​ రామకృష్ణారెడ్డి పద్మ అవార్డు.. 106 మందికి పద్మ పురస్కారాలు!

రిపబ్లిక్‌ డే(గణతంత్ర దినోత్సవం) 2023ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 25 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా వారిలో కొంతమందికి పద్మ విభూషణ్, మరికొందరికి పదశ్మీ అవార్డులు దక్కాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల్లో తెలంగాణ, ఏపీల నుంచి అవార్డు గ్రహీతలున్నారు. 25 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి ప్రొఫెసర్​ రామకృష్ణారెడ్డికి పద్మ పురస్కారం దక్కింది. ఏపీ నుంచి కాకినాడ వాసి చంద్రశేఖర్​కు పద్మశ్రీ పురస్కారం అందనుంది.

కేంద్ర ప్ర‌భుత్వం 106 పద్మ‌ అవార్డులను ప్ర‌క‌టించింది. ఇందులో ఆరుగురికి పద్మ విభూషన్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డుల‌ను అంద‌జేయ‌నుంది. కాగా, తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మ పుర‌స్కారాలు ద‌క్క‌నున్నాయి. మ‌రో రెండు పద్మభూషణ్, మూడు పద్మశ్రీ పురస్కారాలు ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌.. ఆధ్యాత్మిక విభాగంలో చినజీయర్ స్వామి, కమలేశ్ డి పాటిల్ లకు పద్మభూషణ్ పురస్కారాలు ద‌క్కిన‌ట్టు స‌మాచారం. సాహిత్యం, విద్యారంగంలో బి రామకృష్ణ రెడ్డి, శాస్త్ర, సాంకేతిక విభాగంలో మొదడుగు విజయ్ గుప్తా, ఔషధ రంగంలో హనుమంత రావు పసుపులేటికి పద్మశ్రీ పురస్కారాలు ద‌క్కాయి. కాగా, ఇటివలే చ‌నిపోయిన‌ ములాయం సింగ్ యాదవ్ కు పద్మ విభూషణ్, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణికి ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ పురస్కారం ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement