Saturday, April 20, 2024

Delhi | ఏపీ, తెలంగాణకు నాలుగు ప్రెసిడెంట్ మెడల్స్.. మరో 28 పోలీసు పతకాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం 901 మంది పోలీసులకు మెడల్స్ ప్రకటించగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది మెడల్స్‌కి ఎంపికయ్యారు. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీఎంజీ)కి ఎంపికవగా, 93 మందికి ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ (పీపీఎం) అందుకోనున్నారు. 668 మంది పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ కు ఎంపికయ్యారు. 140 గ్యాలంట్రీ అవార్డులో ఎక్కువ భాగం వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన అధికారులే ఉన్నారు.

80 మంది జమ్మూకాశ్మీర్ పోలీస్ సిబ్బంది కూడా మెడల్స్ పొందినవారి జాబితాలో ఉన్నారు. 45 మందికి సాహసోపేతమైన విభాగంలో అవార్డులు అందాయి. గ్యాలంట్రీ అవార్డులో 48 మంది సీఆర్పీఎఫ్, 31 మంది మహారాష్ట్ర అధికారులున్నారు. 25 మంది జమ్మూకాశ్మీర్ పోలీసులు, 9 మంది జార్ఖండ్ అధికారులు, ఏడుగురు ఢిల్లీ పోలీసులు, పలువురు ఉత్తరాది రాష్టాలకు చెందినవారున్నారు.

తెలంగాణకు 2 ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్స్
విశిష్ట సేవలందించినందుకు అనిల్ కుమార్ (ఏడీజీ), భృంగి రామకృష్ణ (టీఎస్ఎస్పీ 12 బెటాలియన్)కి ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్స్ దక్కాయి. మరో 13 మంది పోలీసులకు పీఎం మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి. వారిలో తరుణ్ జోషి (నాటి వరంగల్ సీపీ), పేర్ల విశ్వ ప్రసాద్ (జేసీపీ, హైదరాబాద్), గంగసాని శ్రీధర్ (ఏసీపీ, సైబర్ క్రైం), పి నర్సింహా (డిఎస్పీ రిజీనల్ ఇంటలిజెన్స్), ఆర్ అరుణ్ రాజ్ (డీఎస్పీ, బేగంపేట్), జి వెంకటేశ్వర్లు (సిఐ, సిటీ స్పెషల్ బ్రాంచ్), ఎం శ్రీధర్ రెడ్డి (సిఐ, ఐటీ సెల్), ఎన్ ఎస్ జైశంకర్ (ఏఆర్ ఎస్ఐ, 3 బెటాలియన్), కె దయసీల (ఆర్ఐ, వరంగల్), జి. అచ్యుత రెడ్డి (ఏఏసీ గ్రేహౌండ్స్), ఎన్ రాందేవ్ రెడ్డి (సిఐ, ఇంటలిజెన్స్), వీర రామాంజనేయులు (ఏఆర్ ఎస్ఐ, ఇంటలిజెన్స్), బివి సన్యాసి రావు (టీఎస్పీఎస్ హైదరాబాద్)లు ఉన్నారు.

- Advertisement -

ఏపీకి 2 ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇద్దరు అధికారులు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్స్ కి ఎంపికయ్యారు. వారిలో అతుల్ సింగ్ (అడిషనల్ డిజీపీ), సంగం వెంకట రావు (ఆర్ ఎస్ఐ, ఏపీఎస్పీ 6వ బెటాలియన్) ఉన్నారు. మరో 15 మందిపిఎం మెరిటోరియస్ సర్వీస్ పతకాలకు ఎంపికయ్యారు. వారిలో బల్లి రవిచంద్ర (ఎస్పీ గుంటూరు), వై శ్రీనివాస్ రెడ్డి (సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, నంద్యాల) కే ప్రవీణ్ కుమార్ (డిఎస్పి విశాఖపట్నం), బి సత్యనారాయణ (ఏఎస్పి ఆర్మూర్ రిజర్వ్ డ్), కాకినాడ, శివ నారాయణ స్వామి (డిఎస్పి ఏసీబీ కర్నూల్), ఏ.సాదిక్ అలీ (మొలకలచెరువు), పి సుకుమార్ (రిజర్వ్ ఎస్సై హోంగార్డ్ యూనిట్), డి సూరిబాబు (ఎస్ఐ, విశాఖపట్నం), జి పార్థసారథి (ఏఎస్ఐ, తిరుపతి), కే సాంబశివరావు, వై శ్రీనివాసరావు, టి సూర్యనారాయణ రాజు, ఎన్ వరప్రసాద్ (ఎస్ఐ విజయవాడ) బ్రాంచ్, కె రామారావు (కమాండెంట్), టి సూర్యనారాయణ (రిజర్వు ఇన్స్పెక్టర్) ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement