Wednesday, May 8, 2024

ఆహాలో ‘లవ్ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. చైతు, సాయిపల్లవి స్క్రీన్ లూక్ అందరిని ఫిదా చేసింది. శేఖర్ కముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా కురిశాయి. మంచి ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది. థియేటర్లలో అందరిని ఆకట్టుకున్న లవ్ స్టోరీ మూవీ ఇప్పుడు ఓటిటి విడుదలకు సిద్ధమవుతోంది. ‘లవ్ స్టోరీ’ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 22 నుండి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.

ఇది కూడా చదవండి: ‘మా’లో సీసీ ఫుటేజ్ వివాదం.. సీన్ లోకి పోలీసులు!

Advertisement

తాజా వార్తలు

Advertisement