Thursday, March 28, 2024

ఏపీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. మరో ఆరునెలలు ఉచిత వసతి

అమరావతి, ఆంధ్రప్రభ: సచివాలయం, వివిధ శాఖలకు సంబంధించిన హెచ్‌వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని పునరుద్దరిస్తూ ప్రభుత్వం ఊరట కల్పించింది. ఉద్యోగుల ఉచిత వసతిని మరో ఆరు నెలల పాటు- పొడిగించాలని ఏపీ సచివాలయ సంఘం.. సీఎం జగన్‌ను కోరారు.. సచివాలయ సంఘం విజ్ఞప్తిని సీఎం జగన్‌ అంగీకరించారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు ఉచిత వసతిని కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కాగా, సచివాలయ, హెచ్‌వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఉచిత వసతిని ఎత్తేస్తూ గతంలో ఉత్తర్వులిచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. కానీ, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో ఉచిత వసతి సౌకర్యాన్ని పునరుద్ధ రించింది. సీఎం వైఎస్‌ జగన్‌ తాజా ఆదేశాలతో సచివాలయ, హెచ్‌వోడీల్లో పని చేసే ఉద్యోగులకు ఊరట లభించింది.. దీనిపై ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిహర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ పెద్ద మనస్సుతో ఉద్యోగుల విజ్ఞప్తిని మన్నించారని తెలిపారు. ఆర్ధిక కష్టాల్లో ఉన్నా.. ఉద్యోగుల సంక్షేమం గురించే సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement