Monday, May 27, 2024

వ‌రల్డ్ వైడ్ ప్రీ థియేట్రిక‌ల్ బిజినెస్ లో అద‌ర‌కొడుతున్న ‘‘ఖుషి’’

విజయ్ దేవరకొండ, సమంతల రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఖుషి మూవీకి ప్రేక్ష‌కులలో హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. నిన్ను కోరి, మజిలీ వంటి విజయవంతమైన సినిమాల‌కు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ మూవీని రూపొందించారు. కాగా, ఈ మూవీకి ప్రేక్ష‌కుల‌నుండి వ‌స్తున్న రెస్పాస్స్ తో భారీ థియేట్రికల్ బిజినెస్ చేస్తోంది. హీరో విజయ్ దేవరకొండకు ఉన్న స్టార్‌డమ్ కూడా సినిమాకు ట్రేడ్‌లో మంచి ఆఫర్లు తెచ్చిపెడుతోంది.

ఖుషి ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సుమారు 52.కోట్లు గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆంధ్ర 20CR బిజినెస్ జ‌ర‌గ‌గా.. సీడెడ్ ప్రాంతంలో 6 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జ‌రిగింది. ఇక‌, నిజాంలో దాదాపు 15 కోట్లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇక దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో దాదాపు 3 కోట్ల బిజినెస్ జ‌రిగిట్టు తెలుస్తోంది. అలాగే, విదేశీ వ్యాపారం 7.5 CRకి జరుగుతుంది.

- Advertisement -

కాగా, టైర్ 2 హీరోలలో 50Cr+ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ రికార్డ్ క్రియేట్ చేయ‌గా.. 50Cr+ థియేట్రికల్ బిజినెస్ చేయ‌డం ఇది రెండోసారి. మరి అతని స్టార్‌డమ్ మేకర్స్‌కి ఎంత లాభాలు తెస్తుందో చూడాలి. ఇక, ఈ మూవీ సెప్టెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement