Sunday, May 26, 2024

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో.. ఐపీపీబీ ఒప్పందం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ)తో సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాలకు తన పరిధిని విస్తరించ‌డానికి 4కోట్ల కంటే ఎక్కువ మంది కస్టమర్‌ బేస్‌ను తీర్చడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీపీబీ కస్టమర్లలో 90 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ టై అప్‌ నుంచి ప్రయోజనం పొందొచ్చు. వ్యూహాత్మక కూటమి ఐపీపీబీ తన వినియోగదారులకు వినూత్న డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవ ద్వారా ఫైనాన్స్‌ యాక్సెస్‌తో సహా సరసమైన, విభిన్నమైన ఆఫర్‌లను అందించడానికి వీలు కల్పిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. మైక్రో ఏటీఎంలు, బయోమెట్రిక్‌ పరికరాలతో కూడిన దాదాపు 2 లక్షల పోస్టల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో (పోస్ట్‌మెన్‌, గ్రామీణ డాక్‌ సేవకులు), ఐపీపీబీ వివిధ కస్టమర్‌ విభాగాల అవసరాలను తీరుస్తుంది.

ఈ భాగస్వామ్యంతో భారతదేశం అంతటా ఐపీపీబీ 650 శాఖలు, 1,36,000 పైగా బ్యాంకింగ్‌ యాక్సెస్‌ పాయింట్లు ఏర్పాటు కానున్నాయి. విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడం ద్వారా.. తమ ఆర్థిక చేరిక డ్రైవ్‌ మరింత బలోపేతం చేయాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ వెంకట్రాము మాట్లాడుతూ.. కస్టమర్లకు ఇంటి వద్దే బ్యాంకు సేవలు అందిస్తామన్నారు. ఐపీపీబీ దేశ వ్యాప్తంగా ఆర్థిక చేరికల ల్యాండ్‌ స్కేప్‌ను స్థిరంగా మారుస్తుంది. డిజిటల్‌ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా ఇంటి వద్ద క్రెడిట్‌తో పాటు వివిధ పౌర కేంద్రీకృత సేవలను అందించే ఏకీకృత ప్లాట్‌ఫాం నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రైవేటు రంగ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఇది ముఖ్యమైన ఒప్పందం అని చెప్పారు. ఎందుకంటే.. ఇది తన కస్టమర్‌ ఔట్రీచ్‌ను చివరి మైలు వరకు విస్తరించడంలో సహాయపడుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement