Saturday, April 27, 2024

లార్డ్స్ టెస్ట్: డ్రా కోసం పోరాడుతున్న భారత్..

ఇంగ్లండ్ తో జరుతున్న రెండవ టెస్ట క్లైమాక్స్ కు చేరుకుంది. నాలుగవ రోజు మ్యాచ్ పై పట్టు సాధించిన ఇంగ్లాండ్ ఐదవరోజు కూడా టీమిండియా పై చేయి సాధించేందుకు సిద్దమవుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (14 బ్యాటింగ్‌), ఇషాంత్‌ శర్మ (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన భారత ఓపెనింగ్‌ జోడీ రెండో ఇన్నింగ్స్‌లో మార్క్‌ వుడ్‌ పేస్‌కు వణికింది. 27 పరుగుల లోటుతో మొదలైన భారత రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్‌ సీమర్‌ దెబ్బ మీద దెబ్బ తీశాడు. వుడ్‌ తన వరుస ఓవర్లలో రాహుల్‌ (5), రోహిత్‌ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌)లను పెవిలియన్‌ పంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులకే ఈ రెండు వికెట్లు పడ్డాయి. పుజారాకు కెప్టెన్‌ కోహ్లి జతయ్యాడు. కానీ ఈ జోడీ ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద కోహ్లి (31 బంతుల్లో 20; 4 ఫోర్లు)ని స్యామ్‌ కరన్‌ ఔట్‌ చేశాడు.

కోహ్లీ అవుట్ అయిన తర్వాత భారత్‌ ఆత్మరక్షణలో పడింది. రహానే, పుజారా పూర్తిగా వికెట్లు కాపాడుకునేందుకే పరిమితమయ్యారు. దాంతో పరుగుల వేగం మందగించింది. దీంతో ఈ రెండో సెషన్‌లో 28 ఓవర్లు ఆడినా కూడా భారత్‌ 50 పరుగులు చేయలేకపోయింది. ఓవర్‌కు 2 పరుగుల రన్‌రేట్‌తో ఎట్టకేలకు 51 ఓవర్లో జట్టు స్కోరు 100కు చేరుకుంది. వికెట్‌ కాపాడుకున్న ప్రయోజనం నెరవేరడంతో 105/3 స్కోరు వద్ద టీ విరామానికెళ్లారు. ఆఖరి సెషన్‌లోనూ ఇద్దరు నెమ్మదిగానే ఆడారు. ఈ క్రమంలో 125 బంతుల్లో 5 బౌండరీలతో రహానే ఫిఫ్టీ పూర్తయింది. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక మార్క్‌ వుడ్‌ మళ్లీ కుదుపేశాడు. పుజారాను ఔట్‌ చేశాడు. తర్వాత మొయిన్‌ అలీ స్వల్ప వ్యవధిలో రహానే పోరాటానికి చెక్‌ పెట్టి… రవీంద్ర జడేజా (3)నూ బౌల్డ్‌ చేశాడు. దీంతో మూడో సెషన్‌ భారత్‌కు మళ్లీ ముప్పు తెచ్చింది.

ఐదవ రోజు పంత్ ఎంత సేపు బ్యాటింగ్ చేస్తే టీమిండియా అంత సేఫ్ అయినట్లే.. మనవాళ్లు ఆతిథ్య జట్టు ముందు ఎంత లక్ష్యాన్ని నిలుపుతారనేది ఆసక్తికరంగా మారింది. 230 పై చిలుకు లక్ష్యానని ఇంగ్లండ్ ముందు ఉంచినట్లయితే మ్యాచ్ కాపాడుకున్నట్లవుతుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ డ్రాకు మొగ్గు చూపవచ్చు.

ఇది కూడా చదవండి: ఏపీలో నేటి నుంచి స్కూల్స్ పున:ప్రారంభం..

Advertisement

తాజా వార్తలు

Advertisement