Friday, April 26, 2024

శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా పెరిగింది. ముఖ్యంగా అలమట్టి, నారాయణపూర్, జూరాలకు వరద నీరు పోటెత్తడంతో జలాశయంలో కనిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ ఉంచుకుని వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ఆ నీరు నేరుగా శ్రీశైలం జలాశయానికి చేరుకుంటోంది.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 4,05,416 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుతం నీటిమట్టం 863.7 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. ప్రస్తుతం వంద టీసీఎంలకు పైగా నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువ ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో అధికారులు వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. వరద ఇదే స్థాయిలో కొనసాగితే కొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ వార్త కూడా చదవండి: టీఆర్ఎస్ ఎంపీ బండా ప్రకాష్‌పై చీటింగ్ కేసు నమోదు

Advertisement

తాజా వార్తలు

Advertisement