Friday, April 26, 2024

Delhi Pollution : కాలుష్యం కోరల్లో దేశ రాజధాని ఢిల్లీ..! ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌పై ప్ర‌భావం..!!

వాయు కాలుష్యం ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. కాలుష్యం కార‌ణంగా రోడ్లు కూడా క‌నిపించ‌ని ప‌రిస్థితి.. ఈ స్థాయిలో గాలి కాలుష్యం కావ‌డంతో ప్ర‌జ‌లు రోగాల భారిన ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. జాతీయ రాజధాని ఢిల్లీలోని రీజియన్ (ఎన్సీఆర్)లో వాయు కాలుష్యం భారీ పెరిగింది. ఆయా ప్రాంతాల్లో నివ‌సించే కుటుంబాలు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ సెక్టార్ లో నివసిస్తున్న 80 శాతం కుటుంబాల్లో గత కొన్ని వారాల్లో కనీసం ఒక్కరైనా వాయు కాలుష్య సంబంధిత వ్యాధులను ఎదుర్కొన్నారని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కాలి పీల్చుకోవ‌డానికి కొంద‌రు ఇబ్బందులు ప‌డుతుండ‌గా.. మ‌రి కొంద‌రు వ్యాధుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. డాక్ట‌ర్ల‌ను క‌లిసే వారి సంఖ్య కూడా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్న 8,097 మందిలో 69 శాతం మంది తాము గొంతు నొప్పి లేదా దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్టు వెల్లడించారు. 56 శాతం మంది కళ్లు మండుతున్నట్లు ఫిర్యాదు చేశారు. 50 శాతం మంది ముక్కు కారటం, 44 శాతం మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (ఆస్తమా), 44 శాతం మంది తలనొప్పితో బాధపడుతున్నారు. 44 శాతం మంది నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఐదు కుటుంబాలలో నలుగురు వ్యక్తులు కాలుష్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని, గత ఐదు రోజులుగా పరిస్థితి మరింత దిగజారిందని లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement