Wednesday, April 24, 2024

Gold Price Today: షాకింగ్ న్యూస్… భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు రూ.47 వేల ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.47 వేల వద్ద ఉంది. అంతకుముందు రోజు ఏకంగా 10 గ్రాములకు రూ.900 మేర పెరిగింది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రూ.51,280 వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే ముందురోజు ఏకంగా రూ.1900 మేర పెరిగింది. ప్రస్తుతం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66 వేల 300 వద్ద ఉంది. గత 5 రోజుల్లో రెండు సార్లు రూ.500 మేర తగ్గిన సిల్వర్ ధరలు.. మిగతా 3 సార్లు రూ.2000, రూ.400, రూ.1900 మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రేట్లు ఇటీవల కాలంలో లేనంత పైకి చేరాయి. అయితే.. మళ్లీ తగ్గుతాయనే ఆశలు మాత్రం ఉన్నాయి. బంగారం, వెండి రేట్లు ఆయా ప్రాంతాల పరిస్థితులు, అక్కడి పన్నులను బట్టి మారుతుంటాయి. ఇది గమనించి కొనుగోలు చేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement