Thursday, April 25, 2024

పుణ్య పౌర్ణమి

హరిహరులకు ఇష్టమైన కార్తిక మాసములో చేసిన పుణ్య కార్యక్రమాలు, పూజలు అనంత కోటి ఫలితాలను అందిస్తాయి. ఈ మాసమంతా ప్రతి పవిత్రమైనదే. అందులోనూ సోమవారాలు, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి అత్యంత శుభప్రదమై నవి. కార్తిక మాసం నెలరోజులు చేసే పూజలన్నింటి కంటే కార్తిక పౌర్ణమి నాడు చేసే పూజకు ఫలితము అధికముగా వుంటుంది. కార్తిక పౌర్ణమి నాడు చేసే పూ జ, పౌర్ణమి వ్రతము సౌభాగ్యాన్నివ్వడమే కాదు, పూర్వ జన్మలో చేసిన పాపాలను సైతంరూపుమాపి కైవల్య సిద్ధి కల్గిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తిక మాసం నెల రోజులు పూజలు, వ్రతాలు చేయలేనివారు సోమవారమైనా, కార్తిక పౌర్ణమి ఒక్క రోజైనా ఉపవాసం ఉండి పూజ చేస్తే ఎంతో పుణ్యప్రద మని శాస్త్రం చెబుతోంది. ఈ పౌర్ణమి రోజున స్త్రీలు సూర్యోదయానికి పూర్వ మే పూజావిధిని పూర్తి చేయవలసి వుంటుంది. మన సాం ప్రదాయము ప్రకారము ఈరోజు ఉదయమే పుణ్యస్త్రీలు స్నానం ఆచరించి శుచియైన వస్త్ర ్తము ధరించి ఇంటి ముంగిట రంగవల్లులు దిద్ది, పార తీ పరమేశ్వరులకు ఆహ్వానం పలుకుతూ ఇల్లంతా అలంకరించాలి. సూ ర్యోదయానికి పూర్వమే తులసికొట వద్ద తన వంతుగా 365 వత్తులు, భర్తవంతుగా మరొక 365 వత్తులు వెరసి 730 వత్తులతో దీపాలను ఆవు నేతితోగాని, కొబ్బరి నూనెతోగాని, నువ్వులనూనెతోగాని తడిపి వెలిగిం చాలి. అంతేకాకుండా బియ్యంపిండితో చేసిన దీపా లను, ఉసిరికాయ దీపాలను కూడా సమర్పించాలి. అన్నింటి కన్నా ఆవునేయి శ్రేష్టము. ”దీపం జ్యోతి పర బ్రహ్మ, దీపం జ్యోతి జనార్థన, దీపో హరతు మే పాపం, దీపం జ్యోతి నమోస్తుతే” అంటూ నమస్కారం చేయా లి. అటు పిమ్మట శివాలయమునకు వెళ్ళి గుమ్మడి, కంద దుంప, తాంబూలాదుతో బ్రాహ్మణులకు దాన మిచ్చి, నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. అరటి దొన్నెలో దీపాలను వెలిగించి పవిత్ర నదులలో, కాలువలో వదులుతారు. నదీమతల్లికి పసుపు కుంకు మను సమర్పిస్తారు. ఈ దృశ్యం అత్యంత మనో#హరం గా, కనులకింపుగా వుంటుంది. దీనివల్ల నదీమతల్లి సంతసించి సకల సంపదలు ప్రసాదిస్తుందని, సంపూర్ణ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ దినమంతా ఉపవసించి, సంధ్యాసమయములో యధావిధిగా తిరి గి స్నానాదులు గావించి, చంద్రునికి భక్తితో కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, ఐశ్వర్యం కోరుకుంటూ దీపాలు సమర్పించి వేడుకోవాలి.
”కల్యాణప్రదమైన ఓ సంధ్యాజ్యోతీ మాకు ఆరో గ్యం, ధనం, సంపద, శుభం అనేవి కలిగించి, మాయొ క్క బాహ్యాంతర శత్రు వినాశనం కలిగించమని నమస్క రిస్తున్నాను” అని దీపాలతో అంజలి ఘటించి నమస్కా రం చేయాలి. పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయ ణులను ధనం, సౌభాగ్యం, ఆరోగ్యం, యశస్సునిమ్మని ప్రార్థించాలి. ఆవునేతితోను, మంచి నువ్వు నూనెతోను వెలిగించే దీపాలు వాతావరణంలోని కాలుష్యాని హరించి, ఆహ్లాదకరంగా మారుస్తుంది. రాత్రివేళ చలిమి డిని చంద్రునికి సమర్పించి స్వీకరిస్తారు. వైద్యపరంగా కూడా ఇది అనేక గర్భాశయ సమస్యలను పోగొడుతుం దని చెబుతారు.
ఈరోజు శివాలయంలో ఈశ్వరునికి నవరసాల తో, పంచామృతాలతో మహ‌న్యాస పూర్వక రుద్రాభిషే కాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. తదనం తరం లక్షపత్రి పూజలు, లక్ష కుంకుమార్చనలను నిర్వహిస్తారు. ధాత్రీపూజను కూడా చేస్తారు. తులసి మొక్క కి, ఉసిరి చెట్టుకి వివాహం చేసినట్లయితే లక్ష్మీనారాయ ణుల ఆశీర్వచనం లభిస్తుంది. ఉసిరి చెట్టు లభ్యం కాక పోతే కనీసం ఉసిరి కొమ్మనైనా తులసి కోటలో వుంచి పూజిస్తే మంచిది. ఈరోజు సాయంత్రము సంధ్యాసమ యంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండు గడ్డితో తాడును తయారుచేసి ఆలయం ముంగి ట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగి స్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకీలోనుంచి ఈ తోరణం నుండి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకీని అనుసరించి భక్తులందరూ ముక్తకంఠంతో శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేస్తారు. అనేక జన్మల నుండి చేసిన పాపాన్నీ పటాపంచలయి, ఆనందము కలుగు తుందని శాస్త్ర వచనం.
కార్తిక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వ ధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తిక పురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామదానం చేయాలి. పేదలకు త మకు తగినంత దాన ధర్మాలు చేయాలి. ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని నమ్మిక. అగ్నితత్వాత్మకమైన కృత్తి కా నక్షత్రంలో చంద్రుడు సంచరించే ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రములో అఖండ జ్యోతి వెలిగిస్తారు.
అత్యంత ఫలప్రదమైన ఈ కార్తిక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో ఆచరించి మన సంప్రదాయ విధివిధానాలను ముందు తరాలకు పదిలపరచి లోక క్షేమానికి కృషి చేద్దాం. మన హిందూ పండుగలలో, ఉత్సవాలలో ఆ ధ్యాత్మిక తత్వంతో పాటు లోక కల్యాణము, ప్రకృతి పరి రక్షణ వంటి విష యాలు కూడా దాగివుంటాయి.

  • డా. దేవులపల్లి పద్మజ
    9849692414
Advertisement

తాజా వార్తలు

Advertisement