Friday, April 26, 2024

యాడ్ షూట్ లొకేష‌న్ కి- స్టైలిష్ గా వ‌చ్చిన అల్లు అర్జున్

సినీ సెల‌బ్రిటీలు కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా బిజినెస్ లు..యాడ్ షూట్ల‌తో బిజీగా గ‌డుపుతూ రెండు చేతుల ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. కాగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ తన క్రియేటివిటీతో అనేక వాణిజ్యప్రకటనలు ఆకట్టుకునేవిధంగా రూపొందిస్తుంటారు. అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో వంటి హిట్ చిత్రాలే కాదు, పలు వాణిజ్యప్రకటనలు కూడా వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ తో ఆయన మరో యాడ్ ఫిలిం చిత్రీకరిస్తున్నారు. ఈ యాడ్ షూటింగ్ కు బన్నీ కొత్త లుక్ తో వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అల్లు అర్జున్ ఇటీవలే థాయ్ లాండ్ లో హరీశ్ శంకర్ తో మరో యాడ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement