Thursday, May 16, 2024

త‌న అభిమాని ఆరోగ్యంపై స్పందించిన ఎన్టీఆర్ – బాధితుడి త‌ల్లితో మాట్లాడిన హీరో

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమాని ప్రాణాపాయ‌స్థితిలో హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతున్నాడు. దాంతో ఎన్టీఆర్ స్పందించారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన జనార్దన్ ..ఎన్టీఆర్ కి వీరాభిమాని ఆక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనారోగ్యంతో ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే.. తన అభిమానికి కష్టం వస్తే నేనున్నానంటూ ఎన్టీఆర్‌ స్పందించారు. గత మూడు రోజులుగా తన కొడుకు కన్నుకూడా తేరవడం లేదంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ జనార్థన్‌ తల్లి.. తాను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్‌ గొంతు వింటేనన్నా జనార్థాన్‌ లేస్తాడేమనని ఆశతో ఎన్టీఆర్‌ స్పందించాలంటూ వీడియో తీసి సోషల్‌మీడియాతో ఎన్టీఆర్‌కు పంపారు. వెంటనే స్పందించిన ఎన్టీఆర్‌.. తన టీంను సంబంధింత ఆసుపత్రికి పంపించడమే కాకుండా.. తానే స్వయంగా జనార్థాన్‌ తల్లితో మాట్లాడారు. అంతేకాకుండా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చికిత్స పొందుతున్న జనార్ధన్‌తో మాట్లాడి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement