Monday, May 6, 2024

చైనా నౌకతో శ్రీలంక ఫిదా!

శ్రీలంకలో హంబన్‌టోటా రేవుకు చైనా నౌక చేరుకుంది. మామూలుగా అయితే, ఈ నౌక రావడంలో పెద్ద విశేషమేమీ లేదు. ఈనౌకలో గూఢచార కెమెరాలున్నాయి. చుట్టుపక్కల దేశాల్లోని రక్షణ వ్యవస్థలనూ, రక్షణ యంత్రాంగాలను పసిగ ట్టే కెమెరాలను ఈ నౌకలో అమ ర్చారు. చైనా పంపిన ఈ నౌక పేరు యువాన్‌ వాంగ్‌ 5.ఈ నౌక శ్రీలంక గడ్డమీద కాలూనకుండా చూడాలని రేవుకు రాకుండా చూడాలని శ్రీ లంక ప్రభుత్వాన్ని మనదేశం కోరిన మీదట ఆరు రోజుల ఆలస్యంగా ఆ రేవుకు చేరింది. ఈ నౌక హంబన్‌ టోటా రేవుకు చేరకుండా చూడాలని అమెరికా కూడా చాలా ప్రయత్నించింది.అయినప్పటికీ చైనా లక్ష్యపెట్టలేదు, ఇటు ఇండియా మాటపట్టించు కోలే దు, అటుఅమెరికా మాటనూ పెడచెవిన పెట్టింది.

తైవాన్‌ లో అమెరికా చట్టసభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ కొద్ది రోజుల క్రితం పర్యటించినందుకు గగ్గోలు పెట్టిన చైనా ఈ నౌక శ్రీలంక తీరానికి చేరడంలోతప్పేమీ లేదనీ,దీనిపై భారత్‌ అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ నిప్పులు చెరిగారు. పైగా అమెరికా ఉసి కొల్పడంతో భారత్‌ ఈ విషయమై తమ దేశంపై అనుమానాలు వ్యక్తం చేస్తోందంటూ వాంగ్‌ వెన్‌బిన్‌ ఆరోపించారు. ఈ నౌక శ్రీలంక తీరానికి చేరుకో వడంలో చట్ట విరుద్దమేమీ లేదనీ, శ్రీలంక రాజధాని కొలంబో సమీపంలోని హంబన్‌టోటా రేవును చైనా కంపెనీలు నిర్మించాయనీ, ఈ రేవులో తమ దేశానికి వాటాలున్నాయనీ,అందువల్ల దీనిని అడ్డుకునే హక్కు ఏ దేశానికీ లేదని చైనా విదేశాంగ మంత్రి వాదిస్తున్నారు.

దక్షిణ చైనా సముద్రంలో దీవులను ఆక్రమించి వియ త్నాం, ఇండోనేషియా తదితర దేశాలను కలవర పెడుతు న్న చైనా ఇప్పుడు హిందూమహాసముద్రంలో ప్రవేశించ డం సాగర జలాల ఆక్రమణేనని మన దేశం వాదిస్తోంది. ఇప్పటికే మహామార్గం పేరుతో పొరుగున ఉన్న దేశాల సరిహద్దుల్లోకిచొచ్చుకుని వస్తున్న చైనా ఇప్పుడు సాగర జలాల పరిమితులను కూడా ఉల్లంఘిస్తోందని మన దేశం ఆరోపించింది. తీర ప్రాంతంలో సైంటిఫిక్‌ కార్యక లాపాల నిర్వహణ కోసం ఈ నౌక హంబన్‌టోటా రేవుకు చేరుకున్నదనీ, ఈ నౌకలో గూఢ చర్యానికి ఉపయోగ పడే నిఘా నేత్రాలేవీ లేవని చైనా స్పష్టం చేస్తోంది. అంత ర్జాతీయ ప్రమాణాలు, నియమనిబంధనలకు అనుగు ణంగానే ఈ నౌక శ్రీలంక తీరాన్ని చేరుకుందని చైనా పేర్కొంది.

ఈ నౌక వల్ల తమ అంతర్గత విషయాలను చైనా పరిహరించే ప్రమాదం ఉందంటూ భారత్‌ చేసిన ఆరోపణ పూర్తిగా అసంగతమేకాకుండానిరాధారమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఇంతకుముందు స్పష్టం చేశారు. ఈ నౌక ఐదు రోజులు ఆలస్యంగా వచ్చినా, ముందుగా ప్రకటించిన ప్రకారం వారం రోజుల పాటు హంబన్‌టోటా రేవులో ఉంటుంది. శ్రీలంకతో తమ దేశానికి సత్సంబంధాలు ఉన్నాయనీ, అలాగే, శ్రీలంక ప్రభుత్వం వన్‌చైనా (ఒకే చైనా) విధానాన్ని గట్టిగా సమ ర్ధించిందని చైనా విదేశాంగ ప్రతినిధి చెప్పారు.తమ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు,పరస్పర విశ్వాసం ఉన్నప్పుడు, తమనౌక శ్రీలంక తీరానికి చేరడంలో ఇతర దేశాలకు అభ్యంతరం ఎందుకో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

కాగా, ఈ నౌకను అనుమతించడానికి శ్రీలంక ప్రభుత్వం చాలా పెద్ద బేరమే చేసినట్టుగా కనిపి స్తోంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు అంత ర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వంటి అంతర్జాతీయ ఆర్థి క సంస్థల నుంచి రుణం తెచ్చుకోవడంలో సాయపడతా నని చైనా హామీ ఇచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా చైనాశ్రీలంకకు ఇంతవరకూ 2.8 బిలియన్‌ డాలర్ల సాయాన్ని కరోనా తర్వాత అందజేసింది. అంతేకాక, గతమే నెలలో 74 మిలియన్‌ డాలర్ల సాయాన్ని అందిం చేందుకు చైనా అంగీకరించింది.చైనా నుంచి మొత్తం నాలుగు బిలియన్‌ డాలర్ల సాయాన్ని శ్రీలంక కోరుతోం ది. మరో వంక మన దేశం కూడా శ్రీలంకకు భారీగా సాయాన్ని అందజేసింది. నగదు రూపంలోనే కాకుండా ఆహార ధాన్యాలు,పెట్రోలియం ఉత్పత్తులను కూడా మన దేశం లంకకు సరఫరా చేసింది. శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడానికి ఎంత సాయం కావాలన్నా అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వెన్‌బిన్‌ స్పష్టం చేశారు.

- Advertisement -

ఆపద సమయంలో శ్రీలంకను ఆదుకున్నది భారత్‌. అయితే, ఈ విషయాన్ని మరిచి పోయి,ఈ నౌక తమ తీరానికి వచ్చినందుకు ఏదోపెద్ద సాయం ఒరిగిన ట్టుగా లంక ఎంపీలు,ఇతర ప్రజా ప్రతినిధులు జైజై ధ్వానాలు చేయడం గమనార్హం. అంతేకాకుండా రెండు దేశాల మధ్య మైత్రి చిరకాలం వర్ధిల్లాలంటూ వారు చేసి న నినాదాలు అవకాశవాదానికి దర్పణం పడుతున్నా యి. గతంలో సునామీ సంభవించినప్పుడు, అంతర్యు ద్ధం వల్ల అల్లకల్లోల మైనప్పుడు శ్రీలంకకు మన దేశం అందించిన సాయం మరువరానిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement