Friday, September 20, 2024

Editorial : వెూడీ మాట జా…రిందా!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ పార్టీకి ప్రచార సారథి కావడం వల్ల, దేశమంతటా తిరిగి రోజుకు గంటల కొద్దీ ప్రసంగాలు చేయడం వల్ల ఆయన ప్రసంగాల్లో కొన్ని చోట్ల పదనిసలు దొర్లుతున్నాయి. ఆయన ఎంతో సమయస్ఫూర్తితో ప్రత్యర్ధుల విమర్శలను తిప్పి కొడుతూ ఉంటారు. ఎంత ఘాటుగా విమర్శించినా ఎవరి పైనా ఆయన మాట తూలరు. అయితే రాజస్థాన్‌ లో ఆదివారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రసంగంలో దొర్లిన అంశాలు చాలా మందిని ఆశ్చర్య పర్చాయి.

- Advertisement -

కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడినప్పటికీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, ప్రైవేటు ఆస్తులను లాక్కుని ముస్లింలకు పంచిపెట్టేస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళల మంగళ సూత్రాలను కూడా ముస్లింలకు పంపిణీ చేస్తుందంటూ మోడీ చేసిన వ్యాఖ్యపై దుమారం చెలరేగింది.దేశంలో అసమానతలు లేకుండా చేస్తామనీ, పేదలకు అన్నీ పంచుతామంటూ కాంగ్రెస్‌ వాగ్దానం చేయడం ఈరోజు కొత్త కాదు. ఆ పార్టీ అలా చేసి ఉంటే దేశంలో కోటీశ్వరు లు, మహాకోటీశ్వరులు పెరిగేవారు కారు. కాంగ్రెస్‌ హయాం లోనే మిలియనీర్లు పెరిగారు. ఇప్పుడు బిలియ నీర్లు పెరుగుతున్నారు. ఆర్థిక విధానాల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు ఏమాత్రం తేడా లేదన్న వామపక్షాల ఆరోప ణల్లో అణుమాత్రం అసత్యం లేదు. కాంగ్రెస్‌ హయాం లో అంబానీలు పెరిగితే, ఇప్పుడు అదానీలు పెరుగుతు న్నారనేది సామాన్యుల మాట.

అంతేకాక, ముస్లింలను అక్రమ వలసదారులని మోడీ అభివర్ణించారు.అక్రమ వలస దారులను కనుగొని వారి స్వదేశాలకు పంపించే ప్రక్రియను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అమలు జేశా రు. అసోంలో విదేశీయుల సమస్య పరిష్కారానికి ఆమె ఎంతో కృషి చేశారు. మోడీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల లో కమలవికాసానికి పాటుపడి ఉండవచ్చు కానీ, వలస దారుల సమస్య గురించి చేసిందేమీ లేదు. మణిపూర్‌లో హింసను అరికట్టలేకపోయింది. మణిపూర్‌, మిజోరంల లోకి మయన్మార్‌ నుంచి తిరుగుబాటుదారులు అక్రమంగా ప్రవేశించి స్థానిక ప్రజల్లో అశాంతిని కలిగిస్తు న్నారు. లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ రోజున కూడా మణిపూర్‌లో హింస చెలరేగింది.మణిపూర్‌లో హింసను పూర్తిగా అరికట్టేశామని హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించిన కొద్ది రోజులకే హింస చెలరేగింది. దేశం లో ఉన్న ముస్లింలంతా అక్రమ వలస దారులు కారు. సరిహద్దు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటు బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడం కోసం అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. తిలాపాపం తలా పిడికెడు చందంగా ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉంది.

అసత్యాలను వ్యాపింప జేయడంలో కాంగ్రెస్‌ తీరును ప్రధానమంత్రి తీవ్రంగా ఎండగట్టారు. ఎన్‌డిఏ సర్కార్‌ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందనీ, అందుకే 400 ఎంపీ సీట్లు కావాలని అంటున్నదంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణను తిప్పికొట్టారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే తిరిగి వచ్చినా, రాజ్యాంగాన్ని రద్దు చేయలేరంటూ మోడీ కొద్దిరోజుల క్రితం స్పష్టం చేసిన మాట నిజమే. ఆయన అంత నిర్ద్వంద్వంగా స్పష్టం చేసిన తర్వాత కాంగ్రెస్‌ నాయకులు అదే పనిగా రాజ్యాంగం రద్దవుతుం దంటూ విమర్శలు జోస్యాలు చెప్పడం ప్రజలను రెచ్చ గొట్టడం కోసమే. అయితే, ఎవరెంత రెచ్చగొట్టినాప్రజలు విజ్ఞతను పాటిస్తారు. ఎన్నికల సమయంలో ఒళ్ళు తెలి యకుండా ప్రసంగాలు చేయడంలో అందరూ అందరే. పూర్వపు నాయకులు స్థాయీ భేదాన్ని పాటించేవారు. ఇప్పుడలాంటివి లేవు. వేదిక ఎక్కి అసభ్యంగా తిట్టుకోవ డం, అసత్యాలు వల్లించడంలో అందరూ ఆరితేరారు. పూర్వపు నాయకులు ప్రత్యర్ధులను విమర్శించేందుకు ఎంతో మృదువైన పదాలను ఉపయోగించేవారు. ఇందుకు ఎవరో అక్కరలేదు. తొలి ఎన్‌డిఏ ప్రభుత్వానికి సారథి అయిన వాజ్‌పేయే ఉదాహరణ.

ఆయన ప్రత్యర్దు లను విమర్శించేందుకు ఎంతో వాడి అయిన పదాలను ఉపయోగించేవారు. ఇప్పుడున్న సమస్యలన్నీ అప్పు డూ ఉన్నాయి. అలాగే, ప్రతిపక్షాలలో కూడా ఎంతో సం యమనాన్ని పాటించే నాయకులుండేవారు. మార్క్సిస్టు పార్టీ సీనియర్‌ నాయకుడు జ్యోతి బసు బీజేపీ అగ్ర నాయకుడు అద్వానీని క్రిమినల్‌ అని అన్నప్పుడు మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆగ్రహోదగ్రుడయ్యారు. మీ కళ్ళకి మేమంతా క్రిమినల్స్‌గా కనిపిస్తున్నామా అన్నారు. దాంతో జ్యోతిబసు మెత్తబడ్డారు.అద్వానీజీని వ్యక్తిగతంగా తాను దూషించలేదనీ , ఆయన రాజకీయ విధానాల తోనే తాను విభేధిస్తున్నానని సంజాయిషీ ఇచ్చారు. తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ చాయ్‌ తాగారు. అలా ఉండేవి ఆనాటి రాజకీయాలు. సైద్ధాంతికంగా బద్ధ విరోధులైనా మాటలు తూలేవారు కారు. పొరపాటున ఏదైనా పదం దొర్లినా తర్వాత సారీ చెప్పుకోవడమో, సం జాయిషీ ఇచ్చుకోవడమో చేసే వారు. ఇప్పుడు అలాంటి వేమీ లేవు. రాజకీయాల్లో మార్పే ఈ తేడాకు కారణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement