Wednesday, May 8, 2024

రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవా రి ఆలయంలో రేపటి (గురువారం) నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతో త్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నా యి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ద పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. 14వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వారు నాలుగు మాడవీధులలో ఉరేగుతారు. అనంతరం అనంతం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ వసంతోత్సవ అబిషేక, నివేధనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవ రోజు ఏప్రిల్‌ 15 శ్రీ భూసమేత శ్రీమలయప్ప స్వామివారు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు బంగరు రథాన్ని అధిరోహించి తిరుమాడవీధులలో ఊరేగుతారు.అనంతర వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్‌ 16 న శ్రీదేవి, భ ూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారితో పాటుగా శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకా లానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత రుతువులో శ్రీమలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వ సంతోత్సవం అనే పేరు ఏర్ప డింది. ఈ క్రతువులో సుగంధభరిత వికాస పుష్పాలను స్వామిరి సమర్పించడమే గాక వివి ధ ఫలాలను తెచ్చి స్వామికి నివేధించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకుని రేపటి నుంచి 16 వ తేది వరకు కళ్యాణోత్సవం, ఊంజల్‌సవే, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలం కార సేవలను, ఏప్రిల్‌ 15 న నిజపాద దర్శన సేవను టిటిడి రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement