Thursday, April 25, 2024

అంగరంగ వైభవంగా అప్పన్న కల్యాణం

విశాఖపట్నం : లోక కళ్యాణమూర్తి, సిరులొలికించే సింహాద్రినాధుడు కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏటా చైత్రశుద్ధ ఏకాదశి పర్వదినాన అత్యంత వైభవంగా నిర్వహించే కళ్యాణ మహోత్సవాన్ని ఈ ఏడాది కూడా వేలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపించారు. రెండేళ్లు ఏకాంతంగా కళ్యాణం నిర్వహించగా కరోనా తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో ఈ ఏడాది భక్తులకు స్వామి కళ్యాణాన్ని తిలకించే అవకాశం కల్పించడంతో సింహగిరి హరినామ స్మరణతో పులకించింది. ఉత్సవంలో భాగంగా మంగళవారం తెల్లవారు జామున సింహాద్రినాధుడు,శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలుతో అభిషేకం జరిపారు. బాలబోగం, మంగళాశాసనాలు నిర్వహించి భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కొట్నాలు ఉత్సవం కనుల పండుగగా పూర్తి చేశారు. అనంతరం 4.30 నుంచి 6.30 వరకు ఆరాధన, విశేష హోమాలు, గ్రామబలిహరణం, ద్వజారోహణం ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోశ్చరణలు, మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు భాగస్వాముల య్యారు. దీంతో సింహగిరి అంతా పెళ్లి సందడిగా మారింది. రెండేళ్లు తరువాత సిరిలొలికించే సింహాద్రినాధుడు రథంపై భక్తులకు దర్శనమివ్వడంతో వారంతా స్వామిని సేవించి పులకించారు. అంతకుముందు 7నుంచి 8 గంటల వరకు రథాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక అలంకరణల నడుమ రధోత్సవం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమైంది. రథోత్సవాని కి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కదిరి లక్ష్మణరావు నాయకత్వం వహించగా భక్తులు రథాన్ని మాడవీధుల్లో ఊరేగించారు. అనేక మంది భక్తులు భాగ స్వామ్యం కాగా రథంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు చిరుమందహాసంతో దర్శనమివ్వడంతో సింహగిరి శోభాయమానంగా మారింది. తొలు త రథంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్లను విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ, ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబా బు,ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద రెడ్డి , ప్రత్యేక ఆహ్వానితులు, ఇతర ప్రముఖులు దర్శించుకున్నారు.

శాస్త్రోక్తంగా కల్యాణం
రథోత్సవం అనంతరం రాత్రి 10.30 గంటలకు సింహాద్రినా ధుడి కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. అంతకు ముందు కళ్యాణ వేధికను పలు ద్వారాలుతో సర్వాంగ సుందరంగా తీర్చిది ద్దారు. అనంతరం స్వామి, అమ్మవార్లను కళ్యాణ వేదికపై ఆశీనులను చేసి విశ్వక్షేణ, పుణ్యహవచనం, కంకణదారణ, నూతన యజ్ఞోప వీ తం, జిలకర్రబెల్లం, మాంగళ్యదారణ, తలంబ్రాల ప్రక్రియను శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బం దులు కలగ కుండా ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మరో వైపు దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సేవలందిం చారు. ఈ సంద ర్భంగా ఏర్పా టు చేసి న పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఆర్టీసీ, దేవస్థానం భక్తుల కోసం ప్ర త్యేక బస్సులు నడిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement