Monday, April 29, 2024

MBNR : మాజీసీఎం కేసీఆర్ రోడ్ షో ను విజయవంతం చేయాలి…మాజీ ఎమ్మెల్యే మర్రి

నాగర్ కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్‌ 25(ప్ర‌భ‌న్యూస్‌) : లోక్‌స‌భ ఎన్నికల్లో భాగంగా ఈనెల 27న నాగర్ కర్నూల్‌లో జరిగే మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో ను విజ‌య‌వంతం చేయ‌ల‌ని మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ధ‌న్‌రెడ్డి బీఆర్ఎస్ నేత‌ల‌కు పిలుపునిచ్చారు. ఇవాళ‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయ‌న‌ తన నివాసంలో నాగర్ కర్నూల్ టౌన్ పార్టీ నాయకులతో,కార్యకర్తలతో చర్చించి దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

నాగర్ కర్నూల్ పట్టణం నుండి పెద్దఎత్తున పట్టణ వాసులు పాల్గొనే విధంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement