Friday, May 17, 2024

Encounter – విద్యుత్ కోత‌… తాగు నీటి స‌మ‌స్య ఉన్నాయి.. ఇదిగో సాక్ష్యం ..రేవంత్ కు కెసిఆర్ ట్విట్

హైద‌రాబాద్ – ఉస్మానియా యూనివ‌ర్సిటీలో తాగు నీటి, విద్యుత్ కొర‌త కార‌ణంగా విద్యార్థులు గ‌త నాలుగైదు రోజుల నుంచి ఆందోళ‌న బాట ప‌ట్టారు.. . ఈ క్ర‌మంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తెలంగాణ‌లో గ‌త నాలుగు నెల‌లుగా విద్యుత్, సాగునీరు, తాగునీటి స‌ర‌ఫ‌రాపై సీఎం, డిప్యూటీ సీఎం ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని కేసీఆర్ ట్వీట్ చేశారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులే తాగునీటి, విద్యుత్ కొర‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ‌లో విద్యుత్, తాగు, సాగునీరు ఎద్ద‌డి ఉన్న‌మాట వాస్త‌వం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

క‌రెంట్ కొర‌త‌, తాగునీటి ఇబ్బంది కార‌ణంగా విద్యార్థులు హాస్ట‌ళ్ల‌ను ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోవాల‌ని ఓయూ చీఫ్ వార్డెన్ నోటీసులు జారీ చేసిన నోటీస్ ను కెసిఆర్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు..

విద్యుత్, తాగునీటి కొర‌త కార‌ణంగా విద్యార్థులు ఓయూలో ధ‌ర్నా చేప‌ట్టారు. ఒక్క ట్యాంక‌ర్ నీళ్లు దేనికి స‌రిపోతాయ‌ని ఓయూ అధికారుల‌ను విద్యార్థినులు నిల‌దీశారు. ఓయూ చీఫ్ వార్డెన్‌ను విద్యార్థులు క‌లిసి తాగు నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ఏకంగా హాస్ట‌ల్ ను ఖాళీ చేసి ఇళ్ల‌కు వెళ్లాల‌ని చీఫ్ వార్డెన్ నోటీస్ పంపారు.. విద్యుత్ కోత‌లు, తాగు నీటి స‌మ‌స్య ఉన్నాయ‌న‌డానికి ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలంటూ కెసిఆర్ సిఎంను ప్ర‌శ్నించారు..

- Advertisement -

వందేళ్ల చ‌రిత్ర‌లో ఎప్పుడైనా ఇలా జ‌రిగిందా..

వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కరెంటు కొరత, నీళ్ల కొరత ఉందని విద్యార్థులను హాస్టళ్ల నుండి ఖాళీ చేయించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేద‌ని హ‌రీష్ రావు అన్నారు.రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగు నీటి కొరత తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుంది అంటూ రేవంత్ ను నిల‌దీశారు.రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని దబాయిస్తున్న రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్కలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న పరిస్థితులకు ఏం సమాధానం చెబుతారని ప్ర‌శ్నించారు. విద్యార్థుల జీవితాలను, వారి భవిష్యత్తును ప్రభావితం చేసే ఇలాంటి సంకుచిత చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు.. కాంగ్రెస్ పాల‌న‌లోనే ఇటువంటి చారిత్రాత్మ‌క సంఘ‌ట‌ను జ‌ర‌గుతున్నాయంటూ హ‌రీష్ ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement