Friday, May 17, 2024

Jr.NTR :బాలీవుడ్ పార్టీలో ఎన్టీర్ దంప‌తులు

బాలీవుడ్ కల్చర్ వేరేగా ఉంటుందని, రెగ్యులర్ గా అక్కడ స్టార్ సెలబ్రిటీలు పార్టీలు చేసుకుంటారని, డిన్నర్స్ కి బయటకి వెళ్తారని అందరికి తెలిసిందే. బాలీవుడ్ లో పార్టీ కల్చర్ కొంచెం ఎక్కువే. బాలీవుడ్ పార్టీ కల్చర్ కి అలవాటు పడకపోతే అక్కడ నెగ్గుకురావడం కష్టమే అని కొంతమంది నటీనటులు బహిరంగంగానే చెప్పారు. దీంతో బాలీవుడ్ లో ఎదగాలంటే అక్కడ సెలబ్రిటీలంతా ఆ పార్టీ కల్చర్ లో భాగమవుతారు..

- Advertisement -

తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్ సెలెబ్రిటీలతో కలిసి డిన్నర్ పార్టీకి వెళ్ళాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండటంతో ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు. తాజాగా గ‌త‌ రాత్రి ఎన్టీఆర్, తన భార్య ప్రణతితో కలిసి ముంబై బాంద్రాలో ఓ డిన్నర్ పార్టీకి వెళ్ళాడు.

ఈ పార్టీకి ఎన్టీఆర్, ప్రణతి, రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్ లు అందరూ కలిసి వచ్చారు. మరింతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ డిన్నర్ పార్టీలో పాల్గొన్నట్టు సమాచారం. ఎన్టీఆర్, ప్రణతి, బాలీవుడ్ సెలబ్రిటీల వీడియోలు వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement