Sunday, May 26, 2024

గీతాసారం(ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 32

మాం హి పార్థ వ్యపాశ్రిత్య
యే పి స్యు: పాపయోనయ: |
స్త్రియో వైశ్యాస్తథాశూద్రా:
తే పి యాంతి పరాం గతిమ్‌ ||

తాత్పర్యము : ఓ పార్థా! నా శరణుజొచ్చువారు అధమజన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికి పరమగతిని పొందగలరు.

భాష్యము : భౌతిక జీవనములో ఉన్నతి జాతివారు, నీఛ జాతివారు అను తార తమ్యములుండును, కానీ ఆధ్యాత్మిక జీవితములో అందురూ అత్యున్నత గమ్యానికి అర్హులే.
శ్రీమద్భాగవతములో ఛండాలురు సైతము శుద్ధ భక్తుల సాంగత్యములో పవిత్రులు కాగలుగుతారు అని తెలియజేయబడినది. సహజముగా పాపుల కుటుంబాలలో పుట్టిన వారిని ఉన్నత జాతులవారు అంటరానివారిగా చూస్తారు. కానీ, భక్తుడు, భక్తి ఎంత శక్తివంతమైనదంటే అంటరానివారు సైతమూ అత్యున్నత గమ్యానికి అర్హులు కాబడతారు. ఇది మనము శ్రీ కృష్ణుణ్ని ఆశ్రయించి నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement