Sunday, May 12, 2024

గీతాసారం(ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 17

17.
పితాహమస్య జగతో
మాతా ధాతా పితామహ: |
వేద్యం పవిత్రమోంకార
ఋక్సామ యజురేవ చ ||

తాత్పర్యము : నేను ఈ జగత్తును తండ్రిని, తల్లిని, పోషకుడును, పితామహుడును అయియున్నాను. జ్ఞానలక్ష్యమును, పవిత్రము చేయువాడను, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే.

భాష్యము : మనము ఈ ప్రపంచములో తల్లి, తండ్రి, తాత, దేవత, ఇలా ఎన్నో జీవరాశులతో సంబంధాన్ని పెంపొందించుకొంటూ ఉంటాము. అయితే వీరందరూ కృష్ణునిలో భాగమని, ఆయన అంశలని మనము గుర్తించము. నిజానికి వారందరూ కృష్ణునిలో భాగమే. ఇంకా చెప్పాలంటే వేదాలలో తెలిపిన రకరకాల నియమాల లక్ష్యము కూడా కృష్ణుడే. ప్రణవమైన ‘ఓం’కారము శ్రీ కృష్ణుని శబ్ద రూపము మాత్రమే. అలాగే శ్రీ కృష్ణుని తెలుసుకోవాలనుకునే జీవుడు, తెలుసుకునే ఆ జ్ఞానము కూడా కృష్ణుని యందు భాగమే. చివరకు ప్రతిదీ కృష్ణుని యందు భాగమే కనుక అంతా కృష్ణ మయమేనని చెప్పవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement