Wednesday, July 24, 2024

అనుసరణీయం విశిష్టాద్వైతం

మూల ఉపనిషత్తుల సారాన్ని ప్రజలకు చేరువ చేయ జాలని సమయాన, విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించి ఉద్ధరించిన మహోన్నతుడు శ్రీ రామానుజాచార్యులు. దీనజనుల పక్షాన నిలిచి, సమతామూర్తిగా కీర్తింపబడుతున్నారు. త్రిమతాచార్యులలో, ద్వితీయులైనా, కర్త వ్య నిర్వహణలో అద్వితీయులు. అసమాన ధైర్యాన్ని ప్రద ర్శించి, సాటిలేని భక్తి తత్పరునిగా, తత్వవేత్తగా, ఆస్తిక హతువాదిగా, పరమ యోగిగా, శంకర భగవత్పా దుల అద్వైత సిద్ధాంతంలోని దోషా లను సరిదిద్ది, నాటికి ప్రబల ప్రచారంలో ఉన్న సంప్రదా యాలన్నీ, దేవుడిని కొలవడా నికి భిన్నమార్గాలే కాని, వైదిక మతానికి బదులుగా పాటిం చాల్సినవి కానే కాదని నొక్కి చెప్పిన ధీశాలి ఆయన.
వైష్ణవ మత వ్యాప్తికి రామానుజులు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. శ్రీరం గం, కంచి, తిరుమల, మేల్కోటే తదితర ఆలయాల్లో ఆయన చేపట్టిన సంస్కరణలు చెప్పుకోదగి నవి. ఆయన ప్రబోధించిన జీవాత్మ పరమాత్మలకు ప్రకృతిని అనుసంధాన కర్తగా భావిస్తూ ఆయన రూపొందించిన విశిష్టాద్వైత సిద్ధాంతం అనుసరణీయం.

యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ /వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే /అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో /రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే విశిష్టాద్వైత విశిష్ట ప్రచారకుడిగా రామానుజాచార్యులు భాసి ల్లుతున్నారు. జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు ఈ మూడూ సత్యాలని విశిష్టాద్వైతం చెబుతోంది. చిత్‌ అనేది జీవునితో నూ, అచిత్‌ అనేది ప్రకృతితోనూ కూడి ఉంటుంది ఈశ్వరుడూ ఉంటాడు. ఇక్కడ ఈశ్వరుడంటే పరమాత్మ అని అర్థం శరీరంలో జీవుడున్నట్లే జీవుడిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడు. ఈ విషయాలను విశదీకరిస్తూ విశిష్టా ద్వైతం వెలుగులోకొచ్చింది. ఈ మతాన్ని ప్రచారం చేసిన రామానుజాచార్యులకు రెండు ముఖ్య ఉద్దేశాలున్నాయి. వాటిలో మొదటిది- ఆనాడు కొనసాగుతున్న బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ సంప్రదాయాలన్నీ వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవే. ఈ మతాలన్నీ దేవుడ్ని కొలవడానికి ఉన్న వేర్వేరు మార్గాలే కానీ వైదిక మతానికి భిన్నంగా ఉన్నవికావని చెప్పడం. రెండోది- ఇతర సిద్ధాంతాలలోని అస్పష్ట విషయాలను సరిదిద్ది విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిం చడం.. ఈ రెండింటినీ ఆయన జీవిత లక్ష్యాలుగా పెట్టుకుని లక్ష్యసిద్ధి పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement