Thursday, May 30, 2024

నమామి లోకశంకరమ్‌!

”శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదం, శంకరం, లోక శంకరమ్‌||”
జగద్గురువులుగా వినుతించబడిన శ్రీ ఆదిశంకరాచా ర్యులు సాక్షాత్‌ పరమేశ్వర స్వరూపులుగా భక్తుల మనసుల లో కొలువై ఉన్నారు (‘శంకర: శంకర సాక్షా త్‌’). ‘శం’ అంటే శుభము, సుఖము, క్షేమ ము, మంగళమనే అర్థాలున్నాయి. ” ‘శం’ కరోతీ తి శంకర:”. శుభాలను కలిగించేవాడు శంకరుడు. ఆ ఆదిశంకరుడే లోకులకు జ్ఞానా న్ని, త ద్వారా శుభములను ప్రసాదించడానికి శంకరా చార్యులుగా భువిపై అవతరించారు. ”శంభోర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్య రూపా.” పరమ శివుడే శంకర భగవత్పాదు లుగా అవతరించి యావద్భారతం, ఆసేతు శీత నగ పర్యంతం, పాదచారులై మూడుమా ర్లు పర్యటించి, తర్కబద్ధమైన వాదనతో ప్రతి పక్షులను నిరసించి, కులమతాలను ఖండించి, సనాతన ధ ర్మాన్ని ప్రతిష్ఠించారు. వేద విజ్ఞానాన్ని సామాన్యుల దరికి చేర్చిన వేద వ్యాసుడు, శంకరాచార్యులు హరిహర స్వరూపు లు. ”శ కరమ్‌ శంకరాచార్యమ్‌, కేశవం బాదరాయణమ్‌” అని కదా పెద్దల మాట. ఆది శంకరాచార్యులవారు భౌతికంగా జీవించింది 32 సంవత్సరాలే అయినా ఇతరులకు ఎవ్వరికీ సాధ్యపడని రీతిలో ఒక బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక చేతనా కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగారు. మహనీ య గుణ గరిష్ఠు లై, బ్రహ్మవిద్యా వరిష్ఠులై, తమ అసాధారణ పాండిత్యంతో, జ్ఞాన సంపత్తితో, జగద్గురువులుగా, మహా తపస్విగా, సామా జిక సంస్కర్తగా, అద్వైత మత స్థాపకుని గా, గొప్ప కవీశ్వరునిగా విరాజిల్లిన బ#హుముఖ ప్రజ్ఞాధురీణుడా యన. రామేశ్వరం నుండి కేదారం వరకు పవిత్ర పుణ్యక్షేత్రా న్నీ శంకరులు సందర్శించారు. ఎందరో పండితులతో, మేధా వులతో ధార్మిక వాదోపవాదాలు సలిపి విజే తగా నిలిచారు.
”బ్ర#హ్మ సత్యం, జగన్మిథ్యా” (పరబ్ర హ్మమే సత్యమైనది, ఈ ప్రపంచం ఒక మా య); ”అ#హం బ్రహ్మాస్మి” (జీవుడే దేవుడు) మొదలైన వేద వాక్యాలను సామాన్యులకు అర్థమయ్యేరీతిలో చెప్పిన మ#హనీయుడు.
శంకరాచార్యులవంటి వేదాంతి, మహా కవి మరొకరు లేరు. మేధావుల కోసం ఆయన దశోపనిత్తులకు, భగవద్గీతకు, బ్ర హ్మ సూత్రాలకు భాష్యాలు రచించారు. మధ్యమ స్థాయి వారికోసం భజగోవిందం, మనీషా పంచకం, వివేక చూడామణి, నిర్వాణ షట్కం వంటి ప్రకరణ గ్రంథాలు రచించారు. సామాన్యులకు వివిధ దేవ తలకు సంబంధించిన శతాధిక స్తోత్ర సాహత్యాన్ని అందిం చారు. ఆయన రచనలు సకల దేవతలకూ ప్రీతికరములైవి. ఆయన రచనలన్నీ సార్వజనీనము, సార్వ కాలీకములు.
ఆధ్యాత్మిక గురువులైన సన్న్యాసులను అందరినీ దశనామి సంప్రదాయం క్రిందకు తెచ్చి ఒక పటిష్టమైన విశ్వమానవ ధర్మమనదగు అద్వైత వేదాంతాన్ని ప్రతిష్ఠించారు. ఆధ్యా త్మిక తేజో కేంద్రాలుగా శంకర మఠాలు అనేకం ఏర్పాటు చేశా రు. పూర్ణానదీ ప్రవాహాన్ని తమ స్వగ్రామమైన కాలడిలో వృద్ధురాలైన తమ తల్లి సౌకర్యార్థం తమ ఇంటి వద్దకు మళ్ళిం చుట; కనకధారాస్తవంతో పేద రాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించుట; రాజుగారి మృత శరీరంలోకి పరకాయ ప్రవేశం చేయుట, శిష్యుడైన పద్మపాదుడిని నదీ ప్రవా#హం లో నడిపించుట, వంటి ఎన్నో మ#హమ లను చూపి తమలోని దేవతాంశను తెలియపరచినా, ఆయన ఒక సామా న్య శిష్యుని లాగ గోవింద భగవత్పాదు లను తమ గురువుగా భావించి సేవించా రు. సన్న్యాస దీక్షకు తల్లిని అంగీకరింపజేయ డం, సన్న్యాసిగా తల్లికి అంత్యక్రియలు నిర్వ ర్తించడం వంటివి చేసి ఆదర్శప్రాయుడ య్యారు. ”చిదానంద రూప: శివో హం శివోహం.” చిదానంద స్వ రూపుడైన ఆ పరమ శివుడను నేను అన్న పరమ గురువు లకు శంకర జయంతి పర్వదినాన నమ స్సుమాంజలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement