Sunday, April 28, 2024

తిరుప్పావై ప్రవచనాలు :


పాశురము : 17

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

అమ్బరమే; తణ్ణీరే; శోఱ; అఱమ్‌ శెయ్యుమ్‌
ఎమ్బెరుమాన్‌! నన్దగోపాలా! ఎళున్దిరాయ్‌;
కొమ్బానార్కెల్లామ్‌ కొళున్దే! కులవిళక్కే!
ఎమ్బెరుమాట్టి ! యశోదాయ్‌! అఱివుఱాయ్‌;
అమ్బర మూడఱుత్తోఙ్గి యులగళన్ద
ఉమ్బర్‌కోమానే! ఉఱఙ్గాదె ళున్దిరాయ్‌!
శమ్‌పొఱ్కళ లడిచ్చెల్వా! బలదేవా!
ఉమ్బియమ్‌ నీయు ముఱఙ్గేలో రెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనములతో…

- Advertisement -

తాత్పర్యము :
” వస్త్రములనే, చల్లని నీరునే, అన్నమునే ధర్మ బుద్ధితో దానమొసంగు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము.”
ప్రబ్బలి చెట్టువలె వంగిన శరీరము గల పడుతులలో చిగురువంటి మాకులమున మంగళదీపము వంటిదానా! మా స్వామినీ! యశోదా! మేల్కొనుము.
ఆకాశ మధ్యమును భేదించి పెరిగి తన పాదములతో లోకములను కొలచిన నిత్యసూరినాయకా! నిద్రింపక మేల్కొనుము.
ఎర్రని బంగారు కడియమును పాదమునందు ధరించిన ఐశ్వర్యశాలీ! బలరామా! నీవును మీ తమ్ముడును మేల్కొనవలయును.
వస్త్రమనగా భగవన్ముఖ వికాసము నొసంగు శేషత్వము, పరబ్రహ్మము, పరమాకాశము.
నీరు – భోగ్యతా బుద్ధి లేకుండుట – పారతంత్య్రము పొందవలయుననెడి శ్రద్ధ, విరజానదీ జలము.
అన్నము – భగవత్కైంకర్యము, నిష్కృష్ట ఆత్మస్వరూప జ్ఞానము, బ్రహ్మానుభవము.
నందగోపాలుడు – ఆచార్యుడు
యశోద – మంత్రము
మంత్రములలో విష్ణుషడక్షరి వాసుదేవ ద్వాదశాక్షరి అష్టాక్షరులు ముఖ్యములు. వాటిలో అష్టాక్షరి శ్రేష్ఠమైనది.
వామనుడు నారాయణ మంత్రార్థమును వివరించెను.
స ర్వశూన్య వాదులు అగు వేదబాహ్యులను నిరసించి సర్వజగద్వ్యాపకమగు భగవ త్తత్త్వము కలదని తన అస్తిత్వమును అంతటా చూపినది వామనావతారము.
బలరాముని పాదమునకు తొడిగిన కడియము భగవచ్ఛేషత్వము.
కడియము గల బలరాముని పాదము – భాగవత శేషత్వము

Advertisement

తాజా వార్తలు

Advertisement