Monday, May 13, 2024

ధర్మం – మర్మం : బుషి ప్రభోధం – ప్రాణాయామం (ఆడియోతో)

ప్రాణాయామం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ప్రాణాయామము అనగా ప్రాణవాయువును నియంత్రించుట. కుంభక అనగా గాలిని నింపుట, పూర్వక అనగా గాలిని నిలుపుట, రేచకము అనగా గాలిని విడుచుట. వీటితో మనకు కావలసిన పరిశుద్ధమైన వాయువును తీసుకొని పనికిరాని వాయువును విడిచిపెట్టి, శ్వాసలోనికి తీసుకున్న వాయువును వీలైనంత సమయం నిలుపుకోవాలి. తీసుకున్న గాలిని లోపల నిలిపినపుడు అది అన్ని అవయవాలలోకి ప్రవహించి వాటిలోని సకల రోగాలను తొలగిస్తుంది. మనస్సులో నిలిచి మనో దోషాలను తొలగిస్తుంది. లోపలికి తీసుకున్న గాలిని అనగా ప్రాణవాయువును బ యట కు విడిచిపెడుతుంటే ప్రాణవాయువు అంతరించిపోతుంది కావున వాయువును ఎక్కువ మార్లు బయటికి
విడిచిన వారు త్వరగా మరణిస్తారు. తీసుకున్న వాయువును ఎక్కువ కాలం నిలుపుకోగలిగితే దీర్ఘాయుష్షువంతులు అవుతారు. మన పూర్వపు రాజులు. ఋషులు
వేల సంవత్సరాలు జీవించడంలోని రహస్యం ఇదే.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement