Monday, May 13, 2024

భక్తి తత్త్వం

భక్తి అంటే భగవంతునితో అనుబంధాన్ని ఏర్పరచుకోవడ మే. .భక్తి మార్గంలో ఉన్న ఉపాశకులకు సద్గుణాలు అలవ డతాయి. ”భక్తి” అనే కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే, మనోనిగ్ర #హం, ధర్మాచరణ, దయ, శాంతము, మానవత్వం వంటి ఫలాల న్నింటినో అందిస్తుంది. భగవద్గ³ీతలో శ్రీ కృష్ణ పరమాత్మ —
మయ్యా వేశ్య మనో యేమాం నిత్యయుక్తా ఉపాశతే
శ్రద్దయా పరయో పేతాకృతే మే యుక్తత మామతా:!!
”ఎవరైతే నా యందు చెదరని భక్తితో మనస్సును లగ్నంచేసి నిత్యమూ ఉపాశిస్తారో, వారు ఉత్తమ యోగులుగా గుర్తింపబడ తారు” అని చెప్పాడు. భక్తి అంటే విశ్వాసం, శరణాగతి. పవిత్ర ఆరా ధన. నమ్మకం. సాధారణంగా మనం కష్టాలు, ఆర్థిక, ఆరోగ్య సమస్య లు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని ఆశ్రయిస్తాం.
భారమంతా ఆయనపైనే పెట్టి, ”రక్షించు మహాప్రభో” అం టూ మ్రొక్కుతాము. ముడుపులు కడతాము. అప్పటికీ భగవంతు డు దయామయుడు. కాబట్టి, మన ప్రార్థనలు ఆలకిస్తాడు. శరీరా నికి రోగాలు వస్తే మందు వాడతాము. మానసిక రోగాలకు మందు భగవన్నామస్మరణ. తమ జీవితమంతా భక్తి మార్గంలో నడుస్తూ, ఎందరో శిష్యులను తయారుచేయడమే కాకుండా ప్రజలలో భక్తి తత్త్వాన్ని ప్రబోధించినవారు ఎందరో ఉన్నారు.
చైతన్య మహాప్రభు, రామకృష్ణ పరమ#హంస, వివేకానందు డు, నామదేవుడు, విప్రనారాయణ, సక్కుబాయి, మీరాబాయి, త్యాగయ్య, కబీర్‌, అన్నమయ్యవంటి మహాభక్తులెందరో ఉన్నారు. తుకారాం విఠలుని భక్తుడు. ఆయన తన జీవితాన్ని పాండురంగని సేవకే అంకితం చేసాడు. మహారాష్ట్రలోని ‘దే#హు’ గ్రామం అతనిది. ఆరోజుల్లో తుకారాం పక్కనకూర్చొని పాండురంగ విఠలుడు భోజ నం చేస్తారు అనే విషయం ప్రజల్లో విస్తృతమైంది. ఆయన గ్రామా నికి దగ్గరగా ‘చింఛవడీ’ అనే గ్రామంలో ఉన్న విప్రుడు, వేదపండి తుడు, భగవాన్‌శాస్త్రిగారు గణషోపశకుడు. ఆయనకు తుకారాం స#హపంక్తిని విఠలుడు భోజనం చేస్తాడన్న విషయంపై నమ్మకం కల గక, తుకారాంను పరీక్షించాలనుకొన్నారు. తన ఇంటికి తుకారాం ను భోజనానికి ఆహ్వానించాడు. ఆయన ఆహ్వానం మేరకు తుకా రాం శాస్రిగారింటికి వచ్చారు. భోజనాలకు ఏర్పాట్లు జరుగుతు న్నాయి. అప్పుడు తుకారాం తన విస్తరి పక్కన మరో విస్తరి వేసి వడ్డించమని, శాస్త్రిగారు ఉపాసించే గణపతికి కూడా, ఆయన పక్క నే మరో విస్తరిలో వడ్డించమని కోరాడు. ఆ ఇల్లాలు అలాగే ఏర్పాట్లు చేసారు. వడ్డన పూర్తి అయిన తర్వాత ”శాస్త్రిగారు! మీరు మీ గణ పతిని ఆహ్వానించండి. ఆయన మీ పక్కన కూర్చొని భోజనం చేస్తా రు” అనగానే, శాస్త్రిగారు ఆశ్చర్యంగా ”లంబోదరా! సకల విద్యా సాగరా! విఘ్నేశ్వరా! రండి.. మా ఆతిధ్యం స్వీకరించండి” అని పిలిచారు. పాండురంగడుని తుకారాం ఆహ్వానించారు. క్రమ క్రమంగా గణపతి, విఠలుని విస్తరిలోని పదార్థాలు, వీళ్ళ ఇద్దరి విస్త రిలోని పదార్థాలతో సమానంగా తరిగిపోతున్నాయి. శాస్త్రిగారితో పాటు ఆ ఇంట్లో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ సన్నివేశం వల్ల భక్తుడు ఆర్తితో పిలిస్తే, భగవంతుడు తప్పక వస్తాడని తుకారాం అందరికీ బోధించాడు. ద్రౌపదీ వస్త్రాప#హరణ సమయంలో ఆర్తి తో ప్రార్థిస్తే శ్రీ కృష్ణ పరమాత్మ ఆదుకొన్న సంగతి మనకు తెలిసిందే. కనకదాసు అనే భక్తుని ఉడిపిలోని శ్రీకృష్ణ దర్శనానికి పండితులు, దేవాలయ అధికారులు ప్రవేశం కల్పించకపోతే, ఆయన మొరవినే కనకదాసు ఉన్నవైపు ప్రహారీ పడగొట్టి, దర్శనం కల్పించాడు శ్రీ కృష్ణ పరమాత్మ. ఇటువంటి సంఘటనలు పురాణాలలో చాలా ఉన్నాయి. అవి మనకు ఆదర్శము.
భాగవతంలో భక్తికి తొమ్మిది మార్గాలు విశదీకరించారు.
”శ్రవణం, కీర్తనం విష్ణో: స్మరణం పాదసేవనం,
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం”
శ్రవణ ద్వారా పరీక్షిత్తు, కీర్తన ద్వారా తుంబురుడు, నారదు డు, అన్నమయ్య, త్యాగయ్య వంటివారెందరో ముక్తిని పొందారు. ఇలా ఒక్కో భక్తిమార్గాన్ని ఎంచుకొని, మోక్షాన్ని పొందారు. నారద మ#హర్షి కర్మ, జ్ఞాన యోగాలకంటే, భక్తి యోగమే శ్రేష్టమైనదని బోధించాడు. ప్రస్తుతం సమాజంలో క్షణికావేశంలోనే ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. దీనివల్ల కుటుంబాలు సమస్యల వలయంలో చిక్కుకొంటున్నాయి. మనసు నిగ్ర#హస్తే ఇటువంటి దారుణ సంఘ టనలు ఉండవు. దానికి ఏకైక మార్గం భక్తి ఒక్కటే. భక్తి వల్ల స#హ నం, ఆలోచనాశక్తి పెరుగుతాయి. కాబట్టి మనకున్న సమయంలో ఆ భగవంతుని శర ణాగతి పొంది, సన్మార్గంలో పయనిద్దాం!

– అనంతాత్మకుల రంగారావు
7989462679

Advertisement

తాజా వార్తలు

Advertisement