Monday, May 13, 2024

గౌరవము (ఆడియోతో…)

గౌరవింపబడటాన్ని అందరూ ఇష్టపడతారు, ఇది సరైనది అని చాలామంది నమ్ముతారు కూడా. ఉదాహరణకు, హక్కుల విషయంలో, వాటికి బాధ్యతలు కూడా జోడింపబడి ఉంటాయి. గౌరవాన్ని పొందే యోగ్యంగా కావాలంటే నీకున్న బాధ్యతను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి.

నిజమైన గౌరవము మనం ఏమి చేసాము అన్న ఆధారంతో లభించదు, ఎలా చేసాము అన్నది ముఖ్యము. అంటే మన ప్రవర్తనలో మనం చూపే గుణాలు, విలువల ఆధారంగానే గౌరవింపబడతాము.

గౌరవము అనేది ఇవ్వడము, అడగడానికి మాత్రమే సంబంధించినది కాదు. అంతేకాక, మీరు గౌరవాన్ని ఆశిస్తున్నారు అని ఎదుటివారికి అర్థమైతే వెంటనే వారు మీ నండి విముఖులవుతారు.

ఎందుకంటే గౌరవాన్ని ఆశించడము అంటే నీ ఆత్మకు, నీకు మధ్య దూరం ఏర్పడింది అని అర్థం – చాలా మంది వారిలోని దూరాలను తగ్గించుకోవడంలోనే బిజీగా ఉన్న కారణంగా మరొకరిలోని దూరాన్ని తగ్గించాలన్న ప్రయత్నం వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

గౌరవం పొందాలన్న కోరిక మీకు కలిగితే ఆ కోరికను అనుమానించండి. నిజానికి, నీకు ఎవ్వరూ గౌరవాన్ని ఇవ్వడం లేదు అనేదానికి ఈ ఆలోచనలు అద్దంపడతాయి. గౌరవాన్ని పొం దడానికి నీవు చేసే ప్రయత్నం నీవు అందుకు అనర్హుడవు అని చెప్తుంది.

- Advertisement -

నిన్ను దైవత్వంతో నింపుకో. ఆ దివ్యత్వం నీ జీవితంలో కనిపించనివ్వు. దైవత్వం నిన్ను యోగ్యుడిగా చేస్తుంది.

నీకు అగౌరవం లభిస్తే బాధపడకు. మూడవ వ్యక్తితో నీ ప్రవర్తన గురించి చర్చించు. నీ తప్పు ఏమీ లేకపోతే, నీ అభిప్రాయం సరైనదిగానే ఉంటే అప్పుడు ఇతరులు చేసే విమర్శలకు అతీతంగా నిన్ను స్థిరంగా ఉంచడానికి వచ్చిన పరీక్షగా ఆ పరిస్థితిని భావించు.

ఇలాంటి ఎన్నో పరిస్థి తులు నిన్ను పరీక్షించడానికి వస్తాయి. నీ ఆత్మ గౌరవానికి వీటిని పరీక్షగా భావించు. నీలోని ప్రేమకు, ఓర్పుకు ఇవి పరీక్షలు.

నీ ఆధ్యాత్మిక యోగ్యతను గుర్తించి నీలో ఉన్న భర్తీలన్నింటినీ నింపుకో. ఈ అవగాహన కర్మలలోకి వచ్చినప్పుడు ఇతరులను గౌరవించడం నీకు సహజంగా అనిపిస్తుంది. నువ్వు నిండుగా ఉన్నప్పుడు అన్ని పరీక్షలను నువ్వు పాస్‌ అవుతావు. ఇలా పాస్‌ అవడము నిన్ను ఇతరుల గౌరవాన్ని పొందడానికి యోగ్యంగా చేస్తుంది.

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement