Saturday, May 25, 2024

అన్మమయ్య కీర్తనలు : పొడగంటిమయ్య మిమ్ము

రాగం : మోహనరాగం
ఆదితాళం
ప|| పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటిరాయడా || || పొడగంటి ||

చ|| కోరి మమ్ము నేలినట్టి కులదైవమా ! చాలా
నేరచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా ! మాకు
చేరువ చిత్తములోని శ్రీనివాసుడా! || || పొడగంటి ||

చ|| భావింపకైవసమైన పారిజాతమా ! మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా! మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా! || || పొడగంటి ||

చ|| చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా! రోగా-
లడచి రక్షించే దివ్యౌషధమా!
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా! మమ్ము
గణియించినట్టి శ్రీవేంకటనాధుడా || || పొడగంటి ||

Advertisement

తాజా వార్తలు

Advertisement