Tuesday, May 14, 2024

విజయ్ సేతుపతి ట్రైలర్ రిలీజ్

విజయ్ చందర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి రాశికన్నా హీరోహీరోయిన్ లు గా తెరకెక్కిన చిత్రం సంగతమీజన్. గత ఏడాది నవంబర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తెలుగులో విజయ్ సేతుపతి టైటిల్ తో విడుదలైంది. కాగా ఈ సినిమా తెలుగు రైట్స్ ను హర్షిత మూవీస్ బ్యానర్ అధినేత రావూరి శ్రీనివాస్ తీసుకున్నారు.

ఇక తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన విజయ్ సేతుపతి చిత్రం ఇపుడు ఓటీటీ లో విడుదలకు సిద్ధమైంది. ఆహా లో మే 14న ఇది స్ట్రీమ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి తెలుగు ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో విజయ్ సేతుపతి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement