Saturday, April 27, 2024

పవన్ కు పాజిటివ్ – ఆర్జీవీ రియాక్షన్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక ట్వీట్ చేస్తూ కాంట్రవర్సీ చేస్తూ ఉంటాడు. ఇటీవల గత కొన్ని రోజుల నుంచి కుంభమేళ విషయంపై వరుస ట్వీట్లు చేస్తున్న వర్మ ఇపుడు పవన్ కళ్యాణ్ పై ట్వీట్ చేశాడు. అంతేకాకుండా పవన్ ఫ్యాన్స్ ని కూడా కెలికాడు. పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ జనసేన పార్టీ తరఫున ఓ లేఖను విడుదల చేస్తూ పవన్ చికిత్స తీసుకుంటున్న ఫోటో ని కూడా సోషల్ మీడియాలో పార్టీ పోస్ట్ చేసింది. ఆ ఫోటోని పోస్ట్ చేసిన వర్మ HEY P K FANS , AA VIRUS M LANI PACHCHADI CHESI CHAMPEYYANDI అంటూ ట్వీట్ చేసాడు.

ఇక వర్మ చేసిన ట్వీట్ కి పవన్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. నువ్వు కరోనా పై పాట పాడితే పవన్ కళ్యాణ్ నుంచి కరోనా వెళ్ళిపోతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొంత మంది అనవసరపు విషయాల్లో ఎందుకు తలదూర్చడం అంటూ హెచ్చరిస్తున్నారు. వర్మను బాండ బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా పవన్ విషయంలో వర్మ మొదటి నుంచి కూడా సెటైరికల్ గా పోస్ట్ లు పెడుతూనే వచ్చాడు. ఇక ఇప్పుడు వర్మ చేసిన పోస్ట్ మాత్రం పొగుడుతూ పెట్టాడా లేక తిడుతూ పెట్టాడో ఆయనకే తెలియాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement