Friday, March 29, 2024

జాతిరత్నాలు మాములుగా లేదు – క్రికెటర్ దినేష్ కార్తీక్

అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాతిరత్నాలు. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని చిట్టి సాంగ్ ఎంతటి ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పక్క కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్లను కూడా అదే స్థాయిలో రాబట్టింది.

అయితే ఇప్పటికే జాతిరత్నాలు సినిమాపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించగా తాజాగా క్రికెటర్ దినేశ్ కార్తీక్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. జాతి రత్నాలు సినిమా చూసి ఓ రేంజ్ లో నవ్వుకున్నాం అని అమేజింగ్ డైలాగ్స్, బ్రిలియంట్ డైరెక్షన్, ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ లు చాలా బాగున్నాయని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు తీయడం చాలా కష్టమని కానీ వీరు మాత్రం అవుట్ స్టాండింగ్ జాబ్ అందించారని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement