Saturday, April 27, 2024

వరుణ్ కొత్త సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే ?

భీష్మ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు వెంకీ కుడుముల. అయితే వెంకీ కుడుముల ఇటీవల ఓ వరుణ్ తేజ్ కు కలిసి ఓ కథ చెప్పారట. కథ నచ్చడంతో వరుణ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ సినిమాను దసరా నుండి స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని ఆ స్క్రిప్ట్ ను చదివిన వరుణ్ ఎంతో ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది.

అయితే అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. ఫిలిం నగర్ వర్గాల్లో మాత్రమే దీనికి సంబంధించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భీష్మ సినిమా తర్వాత వెంకీ ఒక్క సినిమాని కూడా చేయలేదు. ఇప్పుడు వరుణ్ తో సినిమా అని వార్తలు వస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ గని, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement