Monday, May 6, 2024

వీడియో:ధోనిలా హెలికాప్టర్ షాట్ కొట్టిన ఏనుగు..

ఏనుగు క్రికేట్ ఆడటం మీరు ఎప్పుడైనా చూశారా..ఆడటం అంటే ఏదో కాలితో బాల్ ని తన్నుతుంది అనుకునేరు.. కాదంటి మహేంధ్ర సింగ్ ధోనిలా బ్యాట్ ని గిర్రున తిప్పుతు హెలికాప్టర్ షాట్లు కొడుతోంది. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మాజీ ఇంగ్లిష్‌ క్రికెటర్ మైఖేల్ వాన్.. రకరకాల మీమ్స్, వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏనుగు క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో ఏనుగు బ్యాటింగ్ చేస్తూ అల‌రిస్తోంది. కొంత మంది యువ‌కులు పెద్ద ఏనుగుకు బంతులు విసురుతుండ‌గా.. మ‌రికొంద‌రు ఫీల్డింగ్ చేస్తున్నారు. తొండంతో బ్యాచ్ ప‌ట్టుకుని అనుభ‌వజ్ఞుడైన క్రికెట‌ర్ మాదిరిగా అన్ని బంతుల‌ను ఆడేస్తూ ఏనుగు ఆక‌ట్టుకున్న‌ది. జ‌ట్టు స‌భ్యులతో క‌లిసి హాయిగా క్రికెట్ ఆడుతున్న ఏనుగు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement