Friday, May 3, 2024

12-15 ఏళ్ల వారికీ టీకా రెఢీ….

కరోనాపై పోరులో మరో ముందడుగు పడింది. 12-15 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలకు టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ టీకాను ఫైజర్‌- ఎన్‌ బయోటెక్‌ అందుబాటులోకి తీసుకురానుంది. ఫైజర్‌- ఎన్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌కు అమెరికాలో అత్యవసర వినియోగానికి ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) సోమవారం అనుమతి ఇచ్చింది. ఫైజర్‌ కంపెనీ 12-15 మధ్య వయస్సున రెండువేల మందికిపైగా క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించింది. ఇందులో వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పని చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఇంతకు ముందు కెనడా హెల్త్‌ సైతం పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఎఫ్‌డీఏ కమిషన్‌ జానెట్‌ వుడ్‌కాక్‌ మాట్లాడుతూ ‘మహమ్మారికి వ్యతిరేక పోరాటంలో ముఖ్యమైన దశ’గా అభివర్ణించారు. టీకా అందుబాటులోకి రావడంతో పిల్లలను రక్షించడంతో పాటు మహమ్మారి అంతానికి ఉపయోగపడుతుందన్నారు. అందుబాటులో ఉన్న డేటాను ఏజెన్సీ కఠినంగా, సమగ్రంగా సమీక్షించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement