Friday, April 26, 2024

‘ఖిలాడి’ రవితేజ కు అనుకోని షాక్

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. కాగా ప్రస్తుతం శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా కూడా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ మొదట దుబాయ్ వెళ్లడానికి సిద్ధమైంది. కానీ ఊహించని రీతిలో ఓ కారణం వల్ల షూటింగ్ మొత్తం వాయిదా పడింది. అసలేం జరిగిందంటే ఖిలాడి సినిమా సాంగ్స్ కొన్ని సన్నివేశాలను దుబాయ్ లో షూట్ చేయాలని దుబాయ్ కాన్సులేట్ కు చిత్ర యూనిట్ అప్లికేషన్లను అప్లై చేసుకుంది. కానీ ఆ అప్లికేషన్స్ ను ఇంకా వారు ఓకే చేయలేదు. దీంతో వీసాలు రాలేదు.

వెయిట్ చేస్తే మరింత ఆలస్యం అవుతుందన్న ఆలోచనతో దర్శక నిర్మాతలు హైదరాబాదులోని ఓ ప్రత్యేకమైన సెట్ ను ఏర్పాటు చేసి షూటింగ్ ను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఆ తర్వాత విడుదల పై క్లారిటీ గా ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement