Thursday, April 25, 2024

వివేకా హత్యకు రూ.8 కోట్ల సుపారీ.. కీలక ఆధారాలు సేకరించిన సీబీఐ

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. వివేకా హత్యకు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు గుర్తించింది. ఇద్దరు ప్రముఖులు ఈ మొత్తన్ని అందజేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి దాదాపు 47 రోజులుగా సీబీఐ బృందం కడప జిల్లాలో మకాం వేసి విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటికే 30 మందికి పైగానే కీలక అనుమానితులను సీబీఐ అధికారులు నాలుగోదఫా విచారించారు. ఎర్రగంగిరెడ్డి, కృష్ణారెడ్డి, డ్రైవర్ దస్తగిరి, సునీల్ కుటుంబం, జగదీశ్వర్ రెడ్డి సోదరులు, వాచ్ మెన్ రంగన్న, పనిమనుషులను విచారించారు. శుక్రవారం వాచ్​మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారించారు. 

వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య ఇచ్చిన సమాచారంతో కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కోసం ఇద్దరు వ్యక్తులు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లుగా రంగయ్య జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట  వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఆ వాంగ్మూలం కీలకంగా మారబోతోంది. సుపారీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఐదుగురు వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉందని రంగయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ ఐదుగురు బయట ప్రాంతానికి చెందినవారని, ఇద్దరు సుపారీ ఇచ్చారని, మరో వ్యక్తి.. మొత్తం 8 మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు రంగయ్య వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. ఈ వాంగ్మూలంతో సీబీఐ అధికారులు ముందుకువెళ్లే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో కేసీఆర్ కు ఆ 412 ఓట్లు ఖాయం

Advertisement

తాజా వార్తలు

Advertisement