Friday, April 26, 2024

ప్రతి శుక్రవారం ‘లక్ష్య’ అప్‌డేట్స్

హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య. నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో లక్ష్య సినిమా చేస్తున్నాడు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేతికశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే లక్ష సినిమాకు సంబంధించి ప్రతి అప్‌డేట్‌ను ప్రతి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈమేర పోస్టర్‌ను ఇవాళ రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement