Friday, April 26, 2024

శాకుంతలం సినిమాలో బుల్లితెర యాంకర్

యాంకర్ వర్షిని సౌందరాజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించారు వర్షిని. అయితే ఇప్పుడు ఓ భారీ బడ్జెట్ సినిమాలో చాన్స్ దక్కించుకున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వర్షిని కి ఛాన్స్ వచ్చింది. ఇప్పటికే ఆమె షూటింగ్ ని కూడా స్టార్ట్ చేసింది. ఇదే విషయాన్ని చెబుతూ నా పాత్ర లేయర్డ్, మల్టిపుల్ లుక్ కలిగి ఉంది. గుణశేఖర్ లాంటి దర్శకుడి దగ్గర పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం.

షూటింగ్ మొదటి రోజు. నేను ఎప్పుడూ పని చేయలేదు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను సమంత అక్కినేని తో పని చేయబోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది వర్షిని. దీంతోపాటు సుమంత్ భార్యగా మళ్ళీ మొదలైంది సినిమాలో కూడా నటించబోతోంది వర్షిని.

Advertisement

తాజా వార్తలు

Advertisement