Thursday, May 2, 2024

సెప్టెంబర్ 10న టక్ జగదీష్ రిలీజ్ !!

శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టక్ జగదీష్. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగదీష్ నాయుడు పాత్రలో కనిపించనున్నాడు నాని. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా ఓ టి టి లో రిలీజ్ కాబోతుంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే వాటిపై చిత్రయూనిట్ స్పందిస్తూ… థియేటర్స్ లోనే ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే తాజాగా మరోసారి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి ఏదో ఒక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement