Friday, April 26, 2024

అనుకున్న టైం కన్నా ముందే ఆదిపురుష్ సెట్ లో ప్రభాస్ !!

ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే సీతగా కృతిసనన్ కనిపించనుంది. ఇదిలా ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్ లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ప్రభాస్ కూడా ఒక్కో సినిమా ని స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాడు.

నిజానికి మొదట ఆదిపురుష్ ను సెప్టెంబర్ నెల నుంచి ప్రభాస్ స్టార్ట్ చేయబోతున్నాడని టాక్ నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం…ఈ సినిమా షూట్ లో పాల్గొనడానికి ప్రభాస్ ఆల్రెడీ ముంబై వెళ్ళినట్లు తెలుస్తుంది. దీనితో అనుకున్న సమయానికంటే ముందుగానే ప్రారంభించినట్లు అర్థమైపోతుంది. ఇక భారీ బడ్జెట్ తో కనివిని ఎరుగని విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement