Thursday, April 25, 2024

పుష్ప రాజ్ వేట కొనసాగుతూనే ఉంది!!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన దాక్కో దాక్కో మేక లిరికల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తోంది.

ఆగస్టు 13న 5 భాషలలో ఈ పాట విడుదల కాగా ఒక్క తెలుగులో ఇప్పటి వరకు 15 మిలియన్ల వ్యూస్, 800కే లైక్స్ ను సాధించింది. ఇక మొత్తం అన్ని భాషలలో కలిపి 28 మిలియన్ల వ్యూస్… 1.4 మిలియన్ల లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికి కూడా ఈ పాట ట్రెండ్ లోనే కొనసాగుతోంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా… దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement