Saturday, April 27, 2024

వకీల్ సాబ్ ప్రీమియర్ షో…టికెట్ ధర ఎంతో తెలుసా ?

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వాకీల్ సాబ్. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ ఫ్యాన్స్ విషయానికి వస్తే ఏప్రిల్ 9 పండగనే చెప్పాలి. కాగా ఏప్రిల్ 8 అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షో లతో ఫ్యాన్స్ రచ్చ చేయబోతున్నారు.

అయితే టికెట్ ధర మాత్రం మామూలుగా లేదట. ఒక్కో టికెట్ ధర 500 రూపాయల వరకు నిర్ణయించారని తెలుస్తోంది. తెల్లవారుజామున షోలకు పర్మిషన్ లు తెచ్చుకొని వీలైనన్ని ఆటలు వేయాలని థియేటర్ల యాజమాన్యాలు చూస్తున్నాయట. టికెట్ ధర 500 రూపాయలు డిసైడ్ చేశారట. అయితే ప్రీమియర్ షోలకు ఎక్కువ ఫ్యాన్స్ మాత్రమే వస్తుంటారు.మరోవైపు టికెట్ కౌంటర్ లో ఐదు వందల రూపాయలకే టికెట్ ఇచ్చినపుడు… బ్లాక్ లో 2000 కైనా వెళ్లే అవకాశం ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement