Friday, April 26, 2024

ఈనెల 31 వరకు గడువు పొడిగింపు

తెలంగాణ ఓపెన్ స్కూల్‌ సొసైటీ (టాస్‌) ప్రవేశాల గడువును అధికారులు మరో రెండు రోజులపాటు పొడిగించారు. ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌ ప్రవేశాల గడువును ఈనెల 31 వరకు పొడిగించారు. టాస్‌ దూరవిద్యా విధానంలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ కోర్సులను అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. అడ్మిషన్‌ ప్రక్రియను ఇప్పటికే ఒకసారి పొడిగించారు. నేటితో గడువు తేదీ ముగియనుండటంతో మరోమారు దరఖాస్తు చివరి తేదీని పొడిగించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ www.telanganaopenschool.org చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement