Wednesday, May 1, 2024

PILL – నోటా ఓట్లు ఎక్కువుంటే విజేత ఎవ‌రు?- సుప్రీంలో పిటిషన్​

న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక‌వేళ ఎన్నిక‌ల్లో నోటాకు ఎక్కువ ఓట్లు పోలైతే, అప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని, అక్క‌డ మ‌ళ్లీ ఎన్నిక నిర్వ‌హించాల‌ని దాఖ‌లైన పిటీష‌న్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కోర్టు నోటీసులు ఇచ్చింది. నోటాకు ఓట్లు ఎక్కువ పోలైతే ఆ ప‌రిస్థితుల్లో ఎలాంటి రూల్స్ అమ‌లులో ఉండాల‌న్న అంశంపై ఆ పిటిష‌న్‌లో కోరారు. నోటా క‌న్నా స్వ‌ల్ప స్థాయిలో ఎక్కువ ఓట్లు పోలైన అభ్య‌ర్థులను అయిదేళ్ల పాటు మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా ఉండే రీతిలో రూల్స్‌ను రూపొందించాల‌ని ఆ పిటిష‌న్‌లో సుప్రీంను కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement