Friday, April 26, 2024

వైల్డ్ డాగ్ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా ?

అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వైల్డ్ డాగ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున సరసన దియామీర్జా నటించారు. అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఏసిపి విజయ్ వర్మ గా నాగ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా 8.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ వైల్డ్ డాగ్ కు వచ్చింది.

తొలిరోజు ఈ సినిమా 1.33 షేర్ లు, 2.60 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.21 కోట్ల షేర్, 2.35 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ఏరియాల వారిగా చూసుకుంటే నైజాం- 53 లక్షలు, సీడెడ్‌- 19 లక్షలు,ఉత్తరాంధ్ర- 16 లక్షలు, ఈస్ట్‌ గోదావరి- 7 లక్షల రూపాయల కలెక్షన్స్ సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement