Sunday, May 5, 2024

కంగువాగా.. ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సూర్య‌

శివ‌పుత్రుడు..యువ‌..గ‌జిని చిత్రాల‌తో టాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ని పెంచుకున్నాడు త‌మిళ స్టార్ హీరో సూర్య‌. తెలుగులో సూర్యకు తిరుగులేని క్రేజ్‌తో పాటు మంచి మార్కెట్ ఏర్ప‌డింది. త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన సినిమాల‌న్ని త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏక‌కాలంలో విడుద‌ల‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఈయ‌న మూడు సినిమాల‌ను సెట్స్ పైన ఉంచాడు. అందులో శివ ద‌ర్శక‌త్వంలో చేస్తున్న పీరియాడిక్‌ సినిమా ఒకటి. సూర్య‌కు జోడీగ బాలీవుడ్‌ బ్యూటీ దిశా ప‌టానీ న‌టిస్తోంది.తాజాగా మేకర్స్‌ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ‘కంగువా ‘అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఓ స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో గుర్రం, గ్రద్ద, కుక్కను హైలేట్‌ చేస్తూ చూపించారు. గుర్రంపై సూర్య కూర్చొని స్వారికి సిద్దమైన వీరుడిలా మైనపు బొమ్మను చూపించారు. ఇక ఈ సినిమా సూర్య కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుంతుంది. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను తమిళం, తెలుగులో సహా పది భాషల్లో ఈ సినిమాను 3డీలో విడుదల చేస్తున్నారు. యూవీ క్రియేష‌న్స్‌, స్టూడీయో గ్రీన్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement