Friday, May 17, 2024

Director’s Day | 19న ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే వేడుకలు..

టాలీవుడ్ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు సినిమా దర్శకుల సంఘం ఘనంగా నిర్వహించింది. దాసరి నారాయణరావు పుట్టినరోజున ప్రతి సంవత్సరం మే 4న డైరెక్టర్స్ డే జరుపుకుంటారు. మే4న ఎల్బీ స్టేడియంలో దర్శకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే, అనుకోని కార‌ణాల వ‌ల‌న ఈ తేదీని మార్చారు. ఈ నెల‌ 19న ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి డైరెక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

దీంతో నేడు దర్శకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్శకుల సంఘం ఆధ్వర్యంలో దాసరి చిత్రపటానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సి కల్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement